AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi US Tour: అమెరికా ప్రెసిడెంట్ బైడెన్‌, ఆయన సతీమణికి మోదీ అరుదైన బహుతులు.. వీటి స్పెషాలిటీ తెలుసా?

ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. క్వాడ్‌ శిఖరాగ్ర సదస్సు, ఐరాస నిర్వహించే మరో సదస్సులో పాల్గొనడంతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో, ఇతర దేశాధినేతలతో ఆయన ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. దీనిలో భాగంగా అధ్యక్షుడు బైడెన్‌ స్వస్థలమైన డెలావర్‌లోని విల్మింగ్టన్‌కు వెళ్లారు. అక్కడ ప్రెసిడెంట్ బైడెన్‌తో మోదీ భేటీ అయ్యారు. అనంతరం..

PM Modi US Tour: అమెరికా ప్రెసిడెంట్ బైడెన్‌, ఆయన సతీమణికి మోదీ అరుదైన బహుతులు.. వీటి స్పెషాలిటీ తెలుసా?
PM Modi Gifts To Biden
Srilakshmi C
|

Updated on: Sep 22, 2024 | 11:38 AM

Share

ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. క్వాడ్‌ శిఖరాగ్ర సదస్సు, ఐరాస నిర్వహించే మరో సదస్సులో పాల్గొనడంతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో, ఇతర దేశాధినేతలతో ఆయన ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. దీనిలో భాగంగా అధ్యక్షుడు బైడెన్‌ స్వస్థలమైన డెలావర్‌లోని విల్మింగ్టన్‌కు వెళ్లారు. అక్కడ ప్రెసిడెంట్ బైడెన్‌తో మోదీ భేటీ అయ్యారు. అనంతరం ప్రెసిడెంట్ బిడెన్‌కి పురాతన వెండి రైలు మోడల్‌ను ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారు. ఇది హ్యాండ్‌ మేడ్‌ రైలు. పాతకాలపు మోడల్‌లో ఉన్న అరుదైన వెండి రైలు ఇది. దీనిని మహారాష్ట్రకు చెందిన కళాకారులు ప్రత్యేకంగా తయారు చేశారు. వెండి హస్తకళలో గొప్ప వారసత్వానికి ప్రసిద్ధి చెందిన హస్తకళాకారులు 92.5 శాతం వెండితో దీనిని తయారు చేశారు. ఈ మోడల్ భారతీయ లోహ కళాత్మకతకు ప్రతీకగా నిలిచింది. చెక్కడం, రిపౌస్సే అనే సుత్తిపని, క్లిష్టమైన ఫిలిగ్రీ వంటి సాంప్రదాయ పద్ధతుల్లో దీనిని తయారు చేశారు. ఇది భారత్‌- అమెరికాల మధ్య బలమైన సంబంధాలను సూచించేలా రూపొందిచారు. ఈ రైలు ప్రధాన క్యారేజ్ వైపు ఢిల్లీ – డెలావేర్, ఇంజిన్ వైపు ఇండియన్ రైల్వేస్ అని ఇంగ్లీషు, హిందీ లిపిలో దీనిపై రాసి ఉంది. ఈ అరుదైన కళాఖండం కళాకారుల అసాధారణ నైపుణ్యాన్ని హైలైట్ చేయడమే కాకుండా ఇండియన్‌ రైల్వే సుదీర్ఘ చరిత్రను కూడా అద్దం పడుతుంది. ఇంతటి చారిత్రక ప్రాముఖ్యత కలిగిన అరుదైన వెండి పురాతన ప్యాసింజర్ రైలు మోడల్‌ను బైడెన్‌కు బహుకరించారు మోదీ.

అలాగే అమెరికా ప్రథమ పౌరురాలు జిల్ బిడెన్‌కు కూడా మోదీ మరో అరుదైన బహుమతిని అందజేశారు. పేపియర్ మాచే బాక్స్‌లో పష్మినా శాలువాలను బహుకరించారు. నాణ్యతల కలిగిన పష్మీనా శాలువా జమ్మూకాశ్మీర్‌లో తయారు చేయించారు. ఇక్కడి శాలువాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్‌ ఉంది. లడఖ్‌లోని చాంగ్తాంగి ప్రాంతం నుంచి ఈ శాలువాల ప్రస్థానం ప్రారంభమైంది. ఈ శాలువాలను మృదువైన ఫైబర్‌తో ప్రత్యేకంగా తయారు చేసిన నూలుతో తయారు చేస్తారు. ఈ నూలు తయారీ పద్ధతి కూడా భిన్నమైనది. ప్రత్యేక నైపుణ్యం కలిగిన కళాకారులు తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి చేతితో మాత్రమే నూలుగా మారుస్తారు. వివిధ మొక్కలు, ఖనిజాలతో తయారు చేసిన సహజ రంగులను మాత్రమే పష్మీనా శాలువాల తయారీలో వినియోగిస్తారు. అందుకే పష్మీనా శాలువాలను మన దేశ వారసత్వ వస్తువులుగా పరిగణిస్తారు. మన పూర్వికుల జ్ఞాపకాలను, భావోద్వేగాలను వీటి దారాలలో నిక్షిప్తమై ఉంటాయని అందరూ భావిస్తారు.

ఇవి కూడా చదవండి

ఇలా తయారు చేసిన షష్మినా శాలువాలు సాంప్రదాయక పద్ధతుల్లోనే ప్యాక్‌ చేస్తారు. జమ్ముకశ్మీర్‌ నుంచి పేపియర్ మాచే బాక్స్‌లలో ప్యాక్ చేస్తారు. శాలువాల సున్నితత్వం, నాణ్యత పాడవకుండా మాచె బాక్‌లు కాపాడుతాయి. ఈ బాక్స్‌లను కాగితం గుజ్జు, జిగురు, ఇతర సహజ పదార్థాల మిశ్రమాన్ని ఉపయోగించి చేతితో తయారు చేస్తారు. కాశ్మీర్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ప్రతి పెట్టె ఒక ప్రత్యేకమైన కళాకృతితో విభిన్న డిజైన్లలో ఆకట్టుకుంటాయి. ఈ బాక్సులను ఫంక్షనల్‌గా మాత్రమే కాకుండా అలంకరణ వస్తువులుగా కూడా వినియోగిస్తుంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.