- Telugu News Lifestyle If these three oils are applied together, the hair will grow thick, Check Here is Details
Oil for Hair: ఈ నూనెలు కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరగడం ఖాయం..
ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో జుట్టు సమస్య కూడా ఒకటి. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. అయితే కొంత మందిలో జుట్టు మళ్లీ పెరగకుండా పల్చగా తయారవుతుంది. కానీ కొన్ని బేసిక్ హెయిర్ కేర్ టిప్స్ ఫాలో చేస్తే జుట్టు పెరుగుతుంది. కొబ్బరి నూనెలో కొన్ని రకాల పదార్థాలను కలిపి తలకు రాస్తే జుట్టు ఖచ్చితంగా పెరగడం ఖాయం. కొబ్బరి నూనెలో 100 ఎంఎల్ ఆలివ్ ఆయిల్, 50 ఎంఎల్ బాదం ఆయిల్, 30 ఎంఎల్..
Updated on: Sep 24, 2024 | 2:13 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో జుట్టు సమస్య కూడా ఒకటి. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. అయితే కొంత మందిలో జుట్టు మళ్లీ పెరగకుండా పల్చగా తయారవుతుంది. కానీ కొన్ని బేసిక్ హెయిర్ కేర్ టిప్స్ ఫాలో చేస్తే జుట్టు పెరుగుతుంది.

కొబ్బరి నూనెలో కొన్ని రకాల పదార్థాలను కలిపి తలకు రాస్తే జుట్టు ఖచ్చితంగా పెరగడం ఖాయం. కొబ్బరి నూనెలో 100 ఎంఎల్ ఆలివ్ ఆయిల్, 50 ఎంఎల్ బాదం ఆయిల్, 30 ఎంఎల్ ఆముదం కలపాలి.

ఉల్లిపాయ నూనెను అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలిపోయే సమస్యతో బాధపడేవారు ఉల్లిపాయ నూనెను రాసుకోవచ్చు. ఇది మెరుగైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

అందుకు తొలుత ఉల్లిపాయ నూనెను తయారు చేసుకోవాలి. ఈ నూనెను తలకు పట్టించడం వల్ల పల్చటి జుట్టు ఒత్తుగా మారుతుంది. ఉల్లిపాయ నూనెను ఎలా తయారు చేయాలంటే.. ఉల్లిపాయ నూనెను తయారు చేయడానికి, 200 గ్రాముల కొబ్బరి నూనె లేదా ఆవాల నూనె తీసుకోవాలి. ఆ తరువాత ఒక పాన్ లో నూనె వేడి చేసి, అందులో 1 పెద్ద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు కరివేపాకు వేయాలి.

ఇవన్నీ కలిపిన నూనె రాసుకోవడం వల్ల జుట్టుకు పోషణ అనేది చక్కగా అందుతుంది. దీంతో మీ జుట్టు రెట్టింపు వేగంతో పెరుగుతుంది. జుట్టు కూడా మృదువుగా తయారవుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




