Heart Failure Signs: గుండె పోటుకు కనిపించే 5 లక్షణాలు.. విస్మరించారో వెలకట్టలేని మూల్యం చెల్లించక తప్పదు
నేటి కాలంలో గుండె వైఫల్యం కారణంగా ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య నానాటికీ పెరుగుతుంది. గుండె కండరాలు రక్తాన్ని పంప్ చేయడం ఆపివేయడం వల్ల సాధారణంగా గుండె వైఫల్యం సంభవిస్తుంది . అలాంటి సందర్భాలలో రక్తం వెనక్కి ప్రవహిస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తులు, కాళ్ళలో ద్రవం పేరుకుపోతుంది. ఇలాంటి సందర్భంలో..

గుండె మన శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం. అందుకే దాని పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. ముఖ్యంగా ఈ రోజుల్లో గుండె వైఫల్యం కారణంగా ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య నానాటికీ పెరుగుతుంది. గుండె కండరాలు రక్తాన్ని పంప్ చేయడం ఆపివేయడం వల్ల సాధారణంగా గుండె వైఫల్యం సంభవిస్తుంది . అలాంటి సందర్భాలలో రక్తం వెనక్కి ప్రవహిస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తులు, కాళ్ళలో ద్రవం పేరుకుపోతుంది. ఇలాంటి సందర్భంలో శ్వాస ఆడకపోవడం, అలసట, కాళ్ళలో వాపు, దడ వంటి లక్షణాలు కనిపించవచ్చు. కానీ ఇది జరగడానికి ముందు కనిపించే కొన్ని లక్షణాలు గుర్తించడం చాలా ముఖ్యం. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. దీని కోసం కార్డియాలజిస్ట్ డాక్టర్ యారనోవ్ గుండె వైఫల్యానికి ముందు కనిపించే 5 ప్రారంభ లక్షణాలను తెలిపారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలు ఇవే..
ఆకస్మికంగా బరువు పెరుగుట
క్రమంగా బరువు పెరగడం సాధారణం. కానీ అది అకస్మాత్తుగా పెరిగితే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ లక్షణం రాబోయే ప్రమాదాన్ని సూచిస్తుంది. ఇది గుండె వైఫల్యానికి కూడా ఓ కారణం. శరీరంలో ద్రవం నిలుపుదల బరువు పెరగడానికి కారణమవుతుంది. అలాగే కొన్ని మందులు తీసుకోవడం, థైరాయిడ్ సమస్యలు, PCOS వంటి పరిస్థితులు కూడా ఆకస్మిక బరువు పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి మీ బరువు ఎటువంటి కారణం లేకుండా పెరిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయవద్దు.
దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
పడుకున్నప్పుడు దగ్గు, ఊపిరి ఆడకపోవడం వంటివి ఎక్కువగా అనిపిస్తే, దానిని నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే చెక్ చేయించుకోవడం మంచిది. దీనికి గుండె ఆగిపోవడం, ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్తమా, శ్వాస సమస్యలు కూడా కారణం కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది.
అనారోగ్యం, ఆకలి లేకపోవడం, కడుపు నిండినట్లు అనిపించడం
ఆకలి మందగించి ఎటువంటి కారణం లేకుండా ఎల్లప్పుడు కడుపు నిండినట్లు అనిపిస్తే, దానిని గుండె సమస్యకు హెచ్చరిక సంకేతంగా పరిగణించాలి. కొన్నిసార్లు ఇది జీర్ణ సమస్యలతో కూడా జరుగుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయవద్దు.
గందరగోళం
చేయవలసిన పనులు మర్చిపోవడం, దేనిపైనా సరిగ్గా శ్రద్ధ చూపలేకపోవడం కూడా గుండె సమస్యల లక్షణాలని కార్డియాలజిస్టులు అంటున్నారు. గుండె పనితీరు తగ్గడం వల్ల ఇది జరగవచ్చు. ఇది మెదడును ప్రభావితం చేస్తుంది. దీన్ని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
నిద్ర సంబంధిత సమస్యలు
సరైన నిద్ర లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు కూడా గుండె ఆరోగ్యానికి సంకేతం. దీనిని ముందుగానే గుర్తించాలి. లేకపోతే ఈ లక్షణాలు గుండెను ప్రభావితం చేయడమే కాకుండా ఇతర సమస్యలకు కూడా దారితీస్తాయి. ఎందుకంటే ఒక రోజు సరిగ్గా నిద్రపోకపోతే, దాని ప్రభావం మరుసటి రోజుపై పడుతుంది. దీనివల్ల పనులు సరిగ్గా చేయతేక తికమకపడిపోతుంటారు. అలసట కూడా వస్తుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. సరైన బరువును నిర్వహించడానికి వ్యాయామం చేయాలి. పోషకాహారం తీసుకోవాలి. రాత్రిపూట మంచి నిద్రపోవాలి. అయితే పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు మాత్రం వాటిని విస్మరించకూడదని కార్డియాలజిస్టులు అంటున్నారు. ఎందుకంటే చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకం కావచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.








