Walnuts: అసలు రోజుకూ ఎన్ని వాల్‌నట్స్ తినాలి.. ఎప్పుడు తినాలో మీకు తెలుసా?
మనం ఆరోగ్యంగా ఉండాలంటే నట్స్‌ను తినాలని చాలా మంది పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అయితే ఎక్కువ మంది నట్స్ అంటే బాదం, జీడిపప్పు, పిస్తా వంటి వాటినే మాత్రమే తింటారు. కానీ వీటిని మంచిన ప్రయోజనాలు వాల్ నట్స్‌లో ఉంటాయని మీకు తెలుసా?. అయితే ఇప్పుడు తెలుసుకొండి, వీటిని ఎలా తినాలి, రోజుకు ఎన్ని తినాలి.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఆరోగ్య నిపుణులు ఎం చెబుతున్నారో అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరోగ్యంగా ఉండేందుకు చాలా మంది పలు రకాల నట్స్‌ను తింటూ ఉంటారు. అందులో వాల్ నట్స్ కూడా ఒకటి. ఎందుకంటే నట్స్ తినడం వల్ల వాటిలో ఉండే పోషకాలు మన శరీరానికి శక్తిని అందించడంతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతాయి. కాబట్టి ఎక్కువ మంది వీటిని తినేందుకు ఇష్టపడుతారు. అయితే ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు మిగతా నట్స్‌లో కన్నా ఈ వాల్‌నట్స్‌లోనే ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ రోజుకు ఎన్ని నట్స్‌ను తినాలి, వీటిలో ఎలాంటి పోషకాలు ఉంటాయి అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రోజుకు 4 నుంచి 7 వాల్‌నట్స్ తినవచ్చట… అది కూడా వాటిని సుమారు 6 నుంచి 8 గంటల వరకు నీటిలో నానబెట్టి.. తర్వాత తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వీటిని ఎలా తినాలి, ప్రయోజనాలు ఏంటి?
అయితే వీటిని నేరుగా తినేందుకు కొందరు ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు వీటిని రాత్రి పడుకునే ముందు నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినాలి. లేదా ఉదయం నానబెట్టి సాయంత్రం స్నాక్స్‌లా కూడా తీసుకోవచ్చు. ఇవి తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఆల్ఫా లినోలీనిక్ యాసిడ్ మన శరీరంలో అంతర్గతంగా ఏర్పడే వాపులను తగ్గిస్తాయి. అంతే కాకుండా గుండె పోటు, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా చూస్తాయి. వీటిని రోజూ తినడం వల్ల మన, బీపీ, షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది.
బ్రెయిన్ హెల్త్, అండ్ క్యాన్సర్ నివారణ
ఈ నట్స్ చూడ్డానికి బలే విచిత్రంగా అచ్చం మన బ్రెయిల్ మాదిరిగనే ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు కూడా మన బ్రెయిన్‌ను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానే ఉపయోగపడుతాయి. అందుకే వీటిని బ్రెయిన్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బ్రెయిన్ సెల్స్‌కు జరిగే నష్టాన్ని నివారించి మెదడుపై ఒత్తిడి ప్రభావం పడకుండా చేస్తాయి. దీంతో మెదడు ఆరోగ్యంగా ఉండి చురుగ్గా పనిచేస్తుంది. అంతే కాకుండా ఈ నట్స్‌లో ఉండే పాలిఫినాల్స్, విటమిన్ ఇ, మెలటోనిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ శరీర కణజాలానికి మరమ్మత్తులు చేసి కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో మన శరీరాన్ని క్యాన్సర్ వంటి వాధ్యుల బారిన నుంచి కాపాడుతాయి.
(గమనిక: పైన పేర్కొన్న అంశాలు నివేదికలు, నిపుణులు, ఇంటర్‌నెట్ నుంచి సేకరించిన వివారాల ద్వారా అందజేయడమైనది. కావున ఈ అంశాలపై మీకు ఎలాంటి సందేహాలు ఉన్న మీ ఫ్యామిలీ డాక్టర్, లేదా ఇతర వైద్యులను సంప్రదించండి)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




