Astrology: ఉదయాన్నే 3 – 5 గంటల మధ్య ఎవరో లేపినట్లు.. అర మీకు మెలకువ వస్తుందా? ఇది అర్ధం ఏమిటో తెలుసా..
చాలా మంది బ్రహ్మ ముహూర్త సమయంలో తెల్లవారుజామున 3-4 గంటలకు మేల్కొంటారు. ప్రతి రోజూ అదే సమయంలో ఎవరో నిద్రలేపినట్లు అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. ఇలా మీకు జరుగుతుంటే, జ్యోతిషశాస్త్రంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది ప్రకృతి నుంచి వచ్చిన అతి పెద్ద సంకేతం. కాబట్టి మీరు కూడా తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల మధ్య మేల్కొంటుంటే, దాని అర్థం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బ్రహ్మ ముహూర్తం అనేక విధాలుగా ప్రత్యేకమైనది. సూర్యోదయానికి దాదాపు గంటన్నర ముందు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. కొన్నిసార్లు అలారం మోగకపోయినా కొంతమంది బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటారు. సరిగ్గా అదే సమయానికి కొంతమంది అకస్మాత్తుగా మేల్కొంటారు. ఇలా మీరూ తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల మధ్య మేల్కొంటే, భయపడాల్సిన అవసరం లేదు. ఇది మీకు శుభ సంకేతమే. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఈ విధమైన పరిణామం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే అనేక శుభశక్తులు ఉదయం మూడు నుంచి నాలుగు గంటల మధ్య తిరుగుతాయట.
తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య మేల్కొంటే ప్రకృతి నుంచి మీకు ఏదో ఊహించని సంకేతం అందుతుండవచ్చు. అయితే మీరు ఈ సమయంలో మేల్కొంటే ఆ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని, అప్పుడే అది మంచి ఫలతాలను ఇస్తుందని నిపుణులు అంటున్నారు. మీరు తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల మధ్య మేల్కొంటే మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి. ఇలా చేస్తే రోజంతా పాజిటివ్ మైండ్ సెట్‌తో కొత్త ఎనర్జీతో నిండి ఉంటారు. అలాగే, అనేక సానుకూల విషయాలు మీ జీవితంలో జరుగుతాయి.
గమనిక: ఇందులోని సమాచారం జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ప్రాధమికంగా అందించింది. మేము ఈ సమాచారాన్ని నిర్ధారించడం లేదు. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు. ఈ సమాచారం ద్వారా మూఢనమ్మకాలను వ్యాప్తి చేయాలనేది మా ఉద్దేశ్యం కాదు. నమ్మకాల ఆధారంగా ఇచ్చినది మాత్రమే.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.








