AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రైతు బిడ్డ రికార్డు.. నవోదయ విద్యార్థినికి ఏకంగా రూ.51 లక్షల ప్యాకేజీతో కొలువు!

మంచిర్యాల జిల్లా వ్యవసాయ కుటుంబంకి చెందిన ఓ విద్యార్ధిని అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. గజ్‌నగర్‌ పట్టణంలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2022లో 12వ తరగతి చదివిన రవీన అనే విద్యార్ధిని మైక్రోసాఫ్ట్‌ సంస్థలో అధిక ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికైంది. ఈ మేరకు నవోదయ..

Telangana: రైతు బిడ్డ రికార్డు.. నవోదయ విద్యార్థినికి ఏకంగా రూ.51 లక్షల ప్యాకేజీతో కొలువు!
Navodaya student gets job in Microsoft
Srilakshmi C
|

Updated on: Aug 08, 2025 | 7:31 AM

Share

మంచిర్యాల, ఆగస్ట్‌ 8: కృషి, సడలని పట్టుదల ఉంటే ఎంతటి విజయాలైన సాధించవచ్చని ఓ రైతు బిడ్డ నిరూపించింది. మంచిర్యాల జిల్లా వ్యవసాయ కుటుంబంకి చెందిన ఓ విద్యార్ధిని అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. గజ్‌నగర్‌ పట్టణంలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2022లో 12వ తరగతి చదివిన రవీన అనే విద్యార్ధిని మైక్రోసాఫ్ట్‌ సంస్థలో అధిక ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికైంది. ఈ మేరకు నవోదయ ప్రిన్సిపల్‌ రేపాల కృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ముడిమడుగు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు బదావత్‌ ప్రభాకర్‌, వనిత దంపతుల కుమార్తె రవీన. చిన్నతనం నుంచే చదువులో ఎంతో చురుకుగా ఉండే రవీన.. 6వ తరగతిలో నవోదయలో ప్రవేశం పొంది 12వ తరగతి వరకు అక్కడే చదివింది. అనంతరం 2022లో అలహాబాద్‌ ఐఐటీలో సీటు పొందింది. ఇటీవల అక్కడ నిర్వహించిన ప్రాంగణ నియామకంలో మైక్రోసాఫ్ట్‌ సంస్థలో ఏడాదికి ఏకంగా రూ. 51 లక్షల వేతనంతో ఉద్యోగానికి ఎంపికైంది. రవీన సాధించిన విజయం ఎందరికో ఆదర్శం.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ముడిమడుగు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు బదావత్‌ ప్రభాకర్‌, వనిత దంపతుల కుమార్తె రవీన. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ రవీనా.. చదువులో ప్రతిభకనబరిచేది. ప్రస్తుతం ఐఐటీ అలహాబాద్‌లో చదువుకుంటున్న రవీనా.. ఈ విద్యా సంవత్సరానికి నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్‌లో పాల్గొన్న దిగ్గజ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌లో అరకోటి రూపాయల భారీ ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికైంది. రవీన విజయం పట్ల ఆమె తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు, సన్నిహితులు, తోటి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షలైన జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌లోనూ ఉత్తీర్ణత సాధించి ఐఐటీలో సీటు సంపాదించి, ఇప్పుడు దిగ్గజ సంస్థలో కొలువుకొట్టడంతో అందరూ రవీనాపై ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. పేదరికం ప్రతిభకు అడ్డుకాదని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని.. ఎందరో యువతకు రవీన విజయగాథ తేలతెల్లం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..