AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CLAT 2026 Exam Date: కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) 2026 రాత పరీక్ష తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?

నేషనల్‌ లా యూనివర్సిటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ) లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (CLAT) 2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్షను జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష..

CLAT 2026 Exam Date: కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) 2026 రాత పరీక్ష తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
CLAT 2026 Exam Date
Srilakshmi C
|

Updated on: Aug 04, 2025 | 8:28 AM

Share

దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్‌ లా యూనివర్సిటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ) లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (CLAT) 2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్షను జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆన్‌లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమైనాయి. కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌)లో మెరుగైన ర్యాంకులు సాధించినవారికి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ, ఏడాది ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన విద్యార్ధులు అక్టోబర్‌ 31, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.

క్లాట్‌ 2026 ర్యాంకుతో ప్రవేశాలు కల్పించే యూనివర్సిటీలు ఇవే..

ఎన్‌ఎస్‌ఐయూ (బెంగళూరు), నల్సార్‌ (హైదరాబాద్), ఎన్‌ఎల్‌ఐయూ (భోపాల్), డబ్ల్యూబీఎన్‌యూజేఎస్‌ (కోల్‌కతా), ఎన్‌ఎల్‌యూ (జోధ్‌పూర్), హెచ్‌ఎన్‌ఎల్‌యూ (రాయ్‌పూర్), జీఎన్‌ఎల్‌యూ (గాంధీనగర్), ఆర్‌ఎంఎల్‌ ఎన్‌ఎల్‌యూ (లఖ్‌నవూ), ఆర్‌జీఎన్‌యూఎల్‌ (పంజాబ్), సీఎన్‌ఎల్‌యూ (పట్నా), ఎన్‌యూఏఎల్‌ఎస్‌ (కొచ్చి), ఎన్‌ఎల్‌యూవో (ఒడిశా), ఎన్‌యూఎస్‌ఆర్‌ఎల్‌ (రాంచీ), ఎన్‌ఎల్‌యూజేఏ (అసోం), డీఎస్‌ ఎన్‌ఎల్‌యూ (విశాఖపట్నం), టీఎన్‌ ఎన్‌ఎల్‌యూ (తిరుచిరాపల్లి), ఎంఎన్‌ఎల్‌యూ (ముంబయి), ఎంఎన్‌ఎల్‌యూ (నాగ్‌పుర్), ఎంఎన్‌ఎల్‌యూ (ఔరంగాబాద్‌), హెచ్‌పీఎన్‌ఎల్‌యూ (షిమ్లా), డీఎన్‌ఎల్‌యూ (జబల్‌పూర్‌), డీబీఆర్‌ఏఎన్‌ఎల్‌యూ (హరియాణా), ఎన్‌ఎల్‌యూటీ (అగర్తలా), జీఎన్‌ఎల్‌యూ (సిల్వస్సా), ఆర్‌పీఎన్‌ఎల్‌యూపీ (ప్రయాగ్‌రాజ్), ఐఐయూఎల్‌ఈఆర్‌ (గోవా).

యూజీ లా కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. పీజీ కోర్సులకు కనీసం 50 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో అప్లికేషన్‌ ఫీజు కింద రూ.4 వేలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, బీపీఎల్‌ అభ్యర్థులు రూ.3,500 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఇక క్లాట్‌-2026 ప్రవేవ పరీక్ష ఆఫ్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 7,2025వ తేదీన దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది.

ఇవి కూడా చదవండి

క్లాట్‌ 2026 ప్రవేశ పరీక్ష కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకోండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.
ఆ మూగజీవం బతికింది.. ఆ బుజ్జిగాడి ప్రాణం పోయింది!
ఆ మూగజీవం బతికింది.. ఆ బుజ్జిగాడి ప్రాణం పోయింది!
'సంతోషం' సినిమాలోని ఈ పిల్లోడు గుర్తున్నాడా? ఇప్పుడు ఫేమస్ హీరో
'సంతోషం' సినిమాలోని ఈ పిల్లోడు గుర్తున్నాడా? ఇప్పుడు ఫేమస్ హీరో
సమోసా రాజధాని.. ఒక్కసారి తింటే మర్చిపోలేరు.. ఈ నగరంలో మాత్రమే!
సమోసా రాజధాని.. ఒక్కసారి తింటే మర్చిపోలేరు.. ఈ నగరంలో మాత్రమే!
'రాసిపెట్టుకోండి.. ఈసారి టైటిల్ మాదే'
'రాసిపెట్టుకోండి.. ఈసారి టైటిల్ మాదే'
పోటీలేదు.. తిరుగుండదు.! కేవలం రూ. 5 వేల పెట్టుబడితో
పోటీలేదు.. తిరుగుండదు.! కేవలం రూ. 5 వేల పెట్టుబడితో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్.
పిల్లల్లో తెలివితేటలు పెంచే  షుగర్ ఫ్రీ లడ్డూ.. ఒక్కటి తింటే చాలు
పిల్లల్లో తెలివితేటలు పెంచే  షుగర్ ఫ్రీ లడ్డూ.. ఒక్కటి తింటే చాలు