AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prickly Heat Reduce Tips: చెమటకాయలతో మంటగా ఉంటోందా.. ఈ టిప్స్‌తో ఈజీగా తగ్గించండి!

వాతావరణంలో మారుతున్న పరిస్థితుల బట్టి చర్మ తత్వం కూడా మారుతూ ఉంటుంది. పొడిగా, దురద, చికాకు, చెమటకాయలు ఇలా కాలాన్ని బట్టి చర్మం కూడా రియాక్ట్ అవుతుంది. సమ్మర్ వచ్చిందంటే చాలా మంది భయ పడేది చెమట కాయల గురించి. కొంత మందికి ఈ సమస్య లేకపోయినా.. మరికొంత మంది మాత్రం చెమట కాయలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారు. చెమట కాయలు గుచ్చుకుంటూ..

Prickly Heat Reduce Tips: చెమటకాయలతో మంటగా ఉంటోందా.. ఈ టిప్స్‌తో ఈజీగా తగ్గించండి!
Prickly Heat Reduce Tips
Chinni Enni
|

Updated on: Jun 03, 2024 | 5:27 PM

Share

వాతావరణంలో మారుతున్న పరిస్థితుల బట్టి చర్మ తత్వం కూడా మారుతూ ఉంటుంది. పొడిగా, దురద, చికాకు, చెమటకాయలు ఇలా కాలాన్ని బట్టి చర్మం కూడా రియాక్ట్ అవుతుంది. సమ్మర్ వచ్చిందంటే చాలా మంది భయ పడేది చెమట కాయల గురించి. కొంత మందికి ఈ సమస్య లేకపోయినా.. మరికొంత మంది మాత్రం చెమట కాయలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారు. చెమట కాయలు గుచ్చుకుంటూ.. మంటతో చిరాకు వస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ చెమట కాయలు ఎందుకు వస్తాయని ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మందికి ఈ సంగతి తెలీదు. కానీ కొన్ని రకాల ఇంటి చిట్కాలతోనే వీటికి చెక్ పెట్టొచ్చు. చెమట కాయల్ని తగ్గించే కొన్ని ఎఫెక్టీవ్ హోమ్ రెమిడీస్‌ ఇప్పుడు చెప్పబోతున్నాం. ఈ టిప్స్ మీకు చక్కగా ఉపయోగ పడతాయి.

ఎందుకు వస్తాయి?

ఎండకు చెమట అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది. అప్పుడే హీట్ రాష్ మొదలవుతుంది. దీంతో బ్యాక్టీరియా, ఫంగస్, మృత కణాలు కలిసి.. చెమట గ్రంథుల్ని మూసివేస్తాయి. ఇలాంటప్పుడు చర్మం ఎర్రబడి.. చెమట పట్టిన చోట పొక్కులు వచ్చేస్తాయి. ఆ తర్వాత దద్దర్లు వస్తాయి. ఇవి గాలికి ఆరి గుచ్చుకుంటూ ఉంటాయి. ఈ చెమట కాయలు త్వరగా తగ్గవు.

కలబంద:

ఈ చెమట పొక్కులను తగ్గించడంలో కలబంద ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. చెమట కాయలు వచ్చిన చోట.. కలబందను నేరుగా రాయవచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని సహజంగా రిపేర్ చేసి.. తగ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి

వేప ఆకులు:

వేప ఆకుల్లో కూడా ఔషధ గుణాలు అనేవి మెండుగా ఉంటాయి. వేప ఆకుల్ని శుభ్రంగా కడిగి.. నీటిలో బాగా మరిగించాలి. ఆ తర్వాత స్నానం చేసే నీటిలో ఆ నీటిని కలిపి.. స్నానం చేయాలి. అదే విధంగా వేపాకుల పేస్ట్ కూడా రాయవచ్చు. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

చందనం:

చెమట పొక్కుల్ని తగ్గించడంలో చందనం కూడా చక్కగా సహాయ పడుతుంది. చెమట కాయల్ని తగ్గించి.. శరీరాన్ని చల్లబరుస్తుంది. దీంతో ఎంతో హాయిగా అనిపిస్తుంది. నీళ్లతో, రోజ్ వాటర్‌తో కూడా కలిపి చందనం రాసుకోవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us