AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Cut: జుట్టును కట్ చేస్తూ ఉంటే వేగంగా పెరుగుతుందా?

ఆరోగ్యంగా, అందంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. కానీ అది అందరికీ సాధ్య పడదు. ఆరోగ్యంగా ఉండాలంటే.. ఖచ్చితంగా హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాల్సిందే. ఇలా చేస్తే అందం కూడా మీ సొంతం అవుతుంది. మీరు తీసుకునే ఆహారం కూడా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడు అన్ని పోషకాలూ శరీరానికి అందుతాయి. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి చాలా తక్కువగా వస్తాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో జుట్టు కూడా..

Hair Cut: జుట్టును కట్ చేస్తూ ఉంటే వేగంగా పెరుగుతుందా?
Hair Cut
Chinni Enni
|

Updated on: Jun 03, 2024 | 6:48 PM

Share

ఆరోగ్యంగా, అందంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. కానీ అది అందరికీ సాధ్య పడదు. ఆరోగ్యంగా ఉండాలంటే.. ఖచ్చితంగా హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాల్సిందే. ఇలా చేస్తే అందం కూడా మీ సొంతం అవుతుంది. మీరు తీసుకునే ఆహారం కూడా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడు అన్ని పోషకాలూ శరీరానికి అందుతాయి. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి చాలా తక్కువగా వస్తాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో జుట్టు కూడా ఒకటి. జుట్టు అందంగా, ఒత్తుగా, పొడుగ్గా ఉండాలని ఆడ, మగ ఇద్దరూ అనుకుంటారు. ఎందుకంటే జుట్టుతోనే సగం అందం రెట్టింపు అవుతుంది.

జుట్టు కోసం చాలా మంది ఖరీదైన ట్రీట్మెంట్లు కూడా తీసుకుంటూ ఉంటారు. సరైన జాగ్రత్త తీసుకుంటూ ఇంట్లో ఉండే పదార్థాలను సరిగ్గా వాడితే.. తక్కువ ఖర్చుతోనే మీ జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో ఎవ్వరికీ ఇది కుదరడం లేదు. అయితే ఇంట్లో అయినా.. బయట అయినా చెప్పేది ఏంటంటే.. జుట్టును కత్తిరిస్తూ ఉంటే వేగంగా పెరుగుతుందని అంటూ ఉంటారు. ఇది అందరూ వినే ఉంటారు. వినడం ఏంటి.. ట్రై చేసి కూడా ఉంటారు. దీంతో ఇష్టం లేకపోయినా చాలా మంది జుట్టు కత్తిరించుకంటూ ఉంటారు. మరి ఇందులో నిజం ఉందా? కేవలం అపోహ మాత్రమేనా? ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ మాత్రం నిజం లేదు..

చాలా మంది జుట్టును కత్తిరిస్తే పెరుగుతుంది అనుకుంటారు. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. తలపై ఉండే స్కాల్ఫ్‌లో ఉండే ఫోలికల్స్ మాత్రమే జుట్టు పెరుగుదలకు కారణం అవుతాయి. జుట్టు పొడవుతో సంబంధం లేదు.

ఇవి కూడా చదవండి

ఈ ప్రయోజనం ఉంది:

అయితే ఎప్పుడూ కాకుండా.. అప్పుడప్పుడూ జుట్టును ట్రిమ్ చేసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వాటిల్లో ఇది కూడా ఒకటి. అప్పుడప్పుడూ అయినా జుట్టును కత్తిరించడం వల్ల చిట్లిన చివర్లను వదిలించుకోవచ్చు.

పోషణ చాలా ముఖ్యం:

కాస్ట్ లీ ప్రాడెక్ట్స్‌ వాడినా సరే.. జుట్టుకు సరైన పోషణ అందించకపోతే.. అది ఏమాత్రం పెరగదు. ముందు మీ తిండిపై దృష్టి పెట్టండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే.. మీ జుట్టు, చర్మం రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. ఇందు కోసం మీరు ఎలాంటి ప్రాడెక్ట్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
హాస్పిటల్స్ ఖర్చులు లేకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి సమోసాలు
హాస్పిటల్స్ ఖర్చులు లేకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి సమోసాలు
జీతం రాగానే అయిపోతోందా? డబ్బు ఆదా చేయడానికి స్మార్ట్ టిప్స్!
జీతం రాగానే అయిపోతోందా? డబ్బు ఆదా చేయడానికి స్మార్ట్ టిప్స్!
కాల్షియం, ప్రోటీన్ డ్రింక్.. వేసవి దాహాన్ని ఇట్టే తీరుస్తుంది..
కాల్షియం, ప్రోటీన్ డ్రింక్.. వేసవి దాహాన్ని ఇట్టే తీరుస్తుంది..
మెడపై ఉన్న మొండి నలుపు మాయం అవ్వడం ఖాయం.. ఇలా చేయండి!
మెడపై ఉన్న మొండి నలుపు మాయం అవ్వడం ఖాయం.. ఇలా చేయండి!
వారి అకౌంట్లోకి రూ.20 వేలు.. స్టేటస్ చెక్ చేస్కోండిలా..
వారి అకౌంట్లోకి రూ.20 వేలు.. స్టేటస్ చెక్ చేస్కోండిలా..
ఇక దశ తిరిగినట్టే..! దిగ్బల యోగంతో వారికి ఉన్నత జీవితం పక్కా..!
ఇక దశ తిరిగినట్టే..! దిగ్బల యోగంతో వారికి ఉన్నత జీవితం పక్కా..!
మీ లైఫ్‌ను టర్న్ చేసే బెస్ట్ మోటివేషనల్ టిప్స్ ఇవి!
మీ లైఫ్‌ను టర్న్ చేసే బెస్ట్ మోటివేషనల్ టిప్స్ ఇవి!
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
టీమిండియాలోకి బుల్లెట్ వేగంతో దూసుకొచ్చిన గిల్ నయా ‘బ్రహ్మాస్త్రం
టీమిండియాలోకి బుల్లెట్ వేగంతో దూసుకొచ్చిన గిల్ నయా ‘బ్రహ్మాస్త్రం
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ