Breaking the Yes Habit: మొహమాటంతో ఎవరేపని చెప్పినా ‘నో’ చెప్పలేకపోవతున్నారా? జాగ్రత్త.. మీకు పీకల్లోతు కష్టాలు తప్పవంతే..
ఎవరైనా ఏదైనా చేయమని అడిగినప్పుడు మనలో చాలా మందికి ఇష్టంలేకపోయినా మొహమాటంతో 'నో' చెప్పలేక ఇరుక్కుపోతుంటారు. ఇలా అన్నింటికీ 'ఎస్' చెప్పుకుంటూ పోతే పీకల్లోతు కష్టాల్లో దూరిపోవడం ఖాయం. ఇతరులు మన గురించి ఏమనుకుంటారో అని చాలా సందర్భాల్లో భయపడుతుంటాం. మనం ప్రతిదానికీ ఇలా..

కొంత మందికి కాస్త మొహమాటం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎవరైనా సహాయం అడిగినప్పుడు, లేదంటే ఏదైనా చేయమని అడిగినప్పుడు మనలో చాలా మందికి ఇష్టంలేకపోయినా ‘నో’ చెప్పలేక ఇరుక్కుపోతుంటారు. ఇలా అన్నింటికీ ‘ఎస్’ చెప్పుకుంటూ పోతే పీకల్లోతు కష్టాల్లో దూరిపోవడం ఖాయం. ఇతరులు మన గురించి ఏమనుకుంటారో అని చాలా సందర్భాల్లో భయపడుతుంటాం. మనం ప్రతిదానికీ ఇలా భయపడిపోయి అన్ని పనులను నెత్తిన వేసుకోవడం వల్ల ఇతరులు దుర్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. అందుకే ప్రతిదానికీ ‘ఎస్’అని చెప్పే ఈ అలవాటుకు వెంటనే గుడ్ బై చెప్పాలి. ఒక వేళ ఇలా చెప్పలేకపోతే లేనిపోని సమస్యలను మనకు మనమే కొని తెచ్చుకుంటున్నట్లు అవుతుంది. కాబట్టి వర్క్ ప్రదేశాల్లో అయినా, మన వ్యక్తిగత జీవితాల్లో అయినా ‘వద్దు’ అని చెప్పాల్సిన సందర్భాల్లో ఖచ్చితంగా చెప్పేయాలి. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా ‘నో’ చెప్పాలి. ‘నో’ అని చెప్పే అలవాటును పెంపొందించుకోవడం ఎందుకు ఇంత ముఖ్యమో ఇక్కడ తెలుసుకుందాం..
నో చెప్పడం ఎంత ముఖ్యమో మీకు తెలుసా?
నో చెప్పే అలవాటును పెంపొందించుకోవడం వల్ల మీ ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరగడమే కాకుండా, ఇతరులు మిమ్మల్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకుండా నిరోధిస్తుంది. అందుకే “నో” చెప్పడం చాలా ముఖ్యం.
మీ విలువను పెంచుతుంది
ప్రతిదానికీ ‘ఎస్’ అని చెప్పడం మంచి అలవాటు కాదు. మీ సౌలభ్యం ప్రకారం కొన్ని సందర్భాల్లో నో చెప్పడం కూడా నేర్చుకోవాలి. ఇది మీ విలువను, ఆత్మగౌరవాన్ని పెంచుతుంది.
ఒత్తిడిని నివారించవచ్చు
మీరు బిజీగా ఉన్నప్పుడు.. ఎవరైనా వచ్చి నా కోసం ఈ పని చేయగలరా? అని అడిగితే మీరు ‘ఎస్’ అని చెబితే మీ పని ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి అధికంగా వర్క్ ఉన్నప్పుడు.. ఎవరు అడిగినా సరే ‘నో’ అని చెప్పండి. ఇది మీ మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
ఆత్మవిశ్వాసం
ప్రతిదానికీ ఎస్ లేదా నో అని చెప్పడం కూడా కాదు. కొన్ని సందర్భాల్లో కాదు అని చెప్పడం నేర్చుకోవాలి. ఇలా మీరు మీ స్వంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
ఆరోగ్యకరమైన సరిహద్దులు
స్పష్టంగా నో చెప్పడం వల్ల ఇతరులు వారి హద్దులను మీరరు. మీ సరిహద్దులను గౌరవిస్తారు. ఇది మీ కోసం జీవించే అవకాశాన్ని ఇస్తుంది. ముఖ్యంగా, ఇతరులు మిమ్మల్ని వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకుండా నిరోధిస్తుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








