Curd and Sugar: జ్ఞాపక శక్తి కావాలా? అయితే గిన్నెడు పెరుగులో అర స్పూన్ ఇది కలిపి తిన్నారంటే..
పెరుగులోని మంచి బ్యాక్టీరియా పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు, ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి12 ( కోబాలమిన్) , పొటాషియం, భాస్వరం, కాల్షియం, ప్రోటీన్, ప్రోబయోటిక్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ కొంతమంది పెరుగును చక్కెరతో కలిపి తీసుకోవడం మీరు చూసే ఉంటారు. ఇలా తీసుకోవడం వల్ల..

పెరుగు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలిసిన విషయమే. ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకలను బలపరుస్తుంది. పెరుగులోని మంచి బ్యాక్టీరియా పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు, ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి12 ( కోబాలమిన్) , పొటాషియం, భాస్వరం, కాల్షియం, ప్రోటీన్, ప్రోబయోటిక్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ కొంతమంది పెరుగును చక్కెరతో కలిపి తీసుకోవడం మీరు చూసే ఉంటారు. అయితే చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది దీనిని తీసుకోవడానికి జంకుతుంటారు. కానీ ఈ విధంగా పెరుగుతో కలిపి చక్కెర తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పెరుగుతో చక్కెరను కలిపి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
పెరుగులో చక్కెర కలిపి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
- పెరుగులో చక్కెర కలిపి తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మాత్రమే కాకుండా శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
- పెరుగులో చక్కెర కలపడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. అంతే కాదు పెరుగు, చక్కెర మిశ్రమం రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.
- పెరుగులో చక్కెర కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది.
- పిల్లలకు పెరుగు, చక్కెర కలిపిన మిశ్రమాన్ని ఇవ్వడం వల్ల వారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలసట, ఒత్తిడి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
- పెరుగులో చక్కెర కలిపి తీసుకోవడం వల్ల జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- భోజనం తర్వాత ఒక కప్పు పెరుగులో అర టీస్పూన్ చక్కెర కలిపి తీసుకోవడం వల్ల అసిడిటీ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
- ఈ విధంగా పెరుగు తీసుకోవడం వల్ల గుండెల్లో మంట సమస్య వెంటనే తగ్గుతుంది.
- శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే, పెరుగును చక్కెరతో కలిపి తీసుకోవడం మంచిది. దీని వల్ల శరీరం చల్లబడి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
- పెరుగులో చక్కెర కలిపి తీసుకోవడం వల్ల శారీరక బలం పెరుగుతుంది.
- మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి పెరుగు, చక్కెర కలిపిన మిశ్రమాన్ని తీసుకోవడం మంచి ఔషధంగా పనిచేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు.
- పెరుగులో చక్కెర కలిపి తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




