AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleep Positions: మీరు ఈ భంగిమలో నిద్రపోతున్నారా.. ఎసిడిటీ సహా అనేక వ్యాధుల బారిన పడొచ్చు.. తస్మాత్ జాగ్రత్త

సరైన పద్దతిలో నిద్రపోకపొతే దాని ప్రభావం శరీరంపైనే కాదు మీ మనస్సుపై కూడా చూపిస్తోంది. అది కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. తప్పు భంగిమలో నిద్రపోతే పదే పదే మేల్కొంటారు. ఇలా సరిపడా నిద్ర లేకపోవడం వల్ల మానసిక స్థితి చికాకుగా మారుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాదు నిద్రపోయే భంగిమ సరైనది కాకపోతే జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపుతుంది. ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

Sleep Positions: మీరు ఈ భంగిమలో నిద్రపోతున్నారా.. ఎసిడిటీ సహా అనేక వ్యాధుల బారిన పడొచ్చు.. తస్మాత్ జాగ్రత్త
Healthy Sleep Positions
Surya Kala
|

Updated on: Aug 26, 2024 | 8:24 PM

Share

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చిన్న చిన్న విషయాలు కూడా చాలా ముఖ్యం. నిద్రించే పధ్ధతి కూడా మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. నిద్ర అనేది మన శరీరానికి శారీరకంగా, మానసికంగా విశ్రాంతినిచ్చే సమయం. మర్నాడు మన శరీరం రీఛార్జ్ అవుతుంది. కనుక నిద్రించే పడుకునే గదికి సంబంధించిన ఉష్ణోగ్రత, కాంతి వంటివాటిని సరిగ్గా ఉంచుకునే చూడడం చాలా ముఖ్యం. తద్వారా సుఖ నిద్రను పొందవచ్చు. అదే సమయంలో సరైన పద్దతిలో నిద్రపోకపొతే దాని ప్రభావం శరీరంపైనే కాదు మీ మనస్సుపై కూడా చూపిస్తోంది. అది కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది.

తప్పు భంగిమలో నిద్రపోతే పదే పదే మేల్కొంటారు. ఇలా సరిపడా నిద్ర లేకపోవడం వల్ల మానసిక స్థితి చికాకుగా మారుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాదు నిద్రపోయే భంగిమ సరైనది కాకపోతే జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపుతుంది. ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

కడుపునిండా నిద్రపోవడం అలవాటు

ఇవి కూడా చదవండి

పురుషుల్లో లేదా మహిళల్లో చాలామందికి కడుపు ఆధారంగా అంటే బోర్లాగా నిద్రపోయే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి శత్రువుగా మారుతుంది. యాసిడ్ రిఫ్లక్స్‌తో బాధపడుతున్న వ్యక్తులు తమ కడుపుని ఆధారంగా చేసుకుని నిద్రపోకూడదు. ఎందుకంటే ఇలా నిద్రపోవడం వలన కడుపుపై ఒత్తిడి పడుతుంది. ఇది ఆరోగ్య సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

యాసిడ్ రిఫ్లక్స్ అంటే ఏమిటి?

మనం ఆహారం తిన్నప్పుడు కడుపులో ఉండే ఆమ్లాలు జీర్ణం కావడానికి సహాయపడతాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఈ యాసిడ్లు అన్నవాహికలోకి అంటే ఆహార పైపులోకి వచ్చినప్పుడు, యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఏర్పడుతుంది. ఇది పుల్లని త్రేనుపుకు కారణమవుతుంది. వికారం మొదలైన సమస్యలు రావచ్చు. కనుక తప్పుడు భంగిమలో నిద్రపోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ సమస్య దీర్ఘకాలం కొనసాగితే గుండెల్లో మంట, పుల్లని త్రేన్పులు రావడమే కాకుండా నోటిపూత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.

కడుపు మీద పడుకోవడం వల్ల ఇతర సమస్యలు ఏమిటంటే

కడుపు ఆధారంగా అంటే బోర్లాగా నిద్రపోయే వారిలో మీరు కూడా ఉన్నట్లయితే.. ఈ అలవాటు జీర్ణక్రియను పాడుచేయడమే కాకుండా వెన్నెముకపై ఒత్తిడిని కలిగిస్తుందని తెలుసుకోండి. అంతేకాదు కండరాలు తిమ్మిరి, జలదరింపు, వెన్ను, మెడ, భుజం కండరాలలో నొప్పి మొదలైన సమస్యలు కూడా మొదలవుతాయి. అయినప్పటికీ గురక పెట్టే సమస్యతో ఇబ్బంది పడేవారు కడుపుపై ​​నిద్రపోవాలని సలహా ఇస్తారు.

ఈ స్థానం ఉత్తమమైనది

నిద్రించడానికి ఉత్తమమైన స్థానం కూడా ఉంది. నిద్రపోవడానికి ఉత్తమమైన మార్గం గురించి మాట్లాడుతే ఒక వైపు పడుకుని.. ఒక సన్నని దిండు కింద ఒక చేతిని ఉంచి, దాని పైన తల ఉంచి, మరొక చేతిని, కాలును సౌకర్యవంతంగా నిటారుగా ఉంచాలి. ప్రక్కన పడుకోవడం చాలా సరైనది పద్దతిగా పరిగణించబడుతుంది. ఈ స్థితిలో నిద్రపోయే వ్యక్తులు తరచుగా తమ భంగిమలను మార్చుకుంటూ మళ్లీ మళ్లీ కుడి, ఎడమ వైపుకు తిరుగుతూ ఉంటారు. దీని కారణంగా రక్త ప్రసరణ, ఆక్సిజన్ ప్రవాహం మొదలైన శరీర విధుల సమతుల్యత నిర్వహించబడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)