Beauty Tips: ఆరోగ్యకరమైన, అందమైన చర్మం కోసం 5 అద్భుతమైన ఆహారాలు.. ప్రతి రోజూ ఇలా చేస్తే..

రుచికరమైన వంటకాలు లేకుండా భారతీయులు ఏ పండుగా జరుపుకోరంటే అతిశయోక్తి కాదు. అది అసంపూర్ణమనే చెప్పాల్సి ఉంటుంది. పండుగ వచ్చిందంటే చాలు..

Beauty Tips: ఆరోగ్యకరమైన, అందమైన చర్మం కోసం 5 అద్భుతమైన ఆహారాలు.. ప్రతి రోజూ ఇలా చేస్తే..
Healthy Skin
Follow us

|

Updated on: Oct 31, 2022 | 7:35 PM

రుచికరమైన వంటకాలు లేకుండా భారతీయులు ఏ పండుగా జరుపుకోరంటే అతిశయోక్తి కాదు. అది అసంపూర్ణమనే చెప్పాల్సి ఉంటుంది. పండుగ వచ్చిందంటే చాలు.. ఆరోగ్యం, డైట్ ఇవేమీ గుర్తుకు రావు. నచ్చింది వండుకుని తినేయడమే ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం అనే లెక్కలేవీ లేకుండా స్వీట్స్, జంక్ ఫుడ్స్ అన్నీ కుమ్మేస్తారు. ఇప్పుడసలే పండుగల సీజన్.. ప్రతీ పండుగకు స్పెషల్ వంటకాలు చేయడం, తినడం కామన్. అయితే, కంటిన్యూగా ఫ్రై చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఫలితంగా డీహైడ్రేట్ అవుతుంది. ఇది చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి సమయంలో సరైన చర్మ సరంక్షణ చర్యలు పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. చర్మ సంరక్షణ చర్యలు తీసుకోవడం వల్ల చర్మానికి మెరుపు వస్తుంది. అందమైన చర్మం కోసం.. స్కిన్ డిటాక్స్ చర్యలు తీసుకోవడం అవసరం. ఇందుకోసం 5 రకాల ఆహారాలు అద్భుతంగా పని చేస్తాయంటున్నారు బ్యూటీషియన్స్. మరి ఆ 5 రకాల ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. కూరగాయలు, పండ్ల జ్యూస్ /స్మూతీలు..

పండ్ల రసాలు, స్మూతీలు చర్మం సమతుల్యతను పునరుద్ధరించడంలో, శరీరానికి పోషకాలను అందించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. చిరుతిళ్లకు బదులు వీటిని తీసుకోవడం వలన మంచి జరుగుతుంది. ఆకలి కూడా తీరుతుంది. ఆరెంజ్ జ్యూస్, దానిమ్మపళ్ల రసం, దోసకాయ, బీట్‌రూట్, అరటిపండ్లతో చేసిన స్మూతీలు చాలా రుచిగా ఉంటాయి. అదే సమయంలో ఇవి చర్మానికి ఆరోగ్యవంతమైన మెరుపు, ప్రకాశాన్ని ఇస్తాయి. ఇవి నాన్-ప్రాసెస్డ్, ప్రిజర్వేటివ్-ఫ్రీ, ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.

2. ఆకు కూరలు, కూరగాయలు..

ఆకుపచ్చని కూరగాయలు చర్మానికి అద్భుత ప్రయోజనాన్ని ఇస్తాయి. వీటిలో విటమిన్ ఎ, జింక్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. బచ్చలికూర, బ్రోకలీ, ఉల్లిపాయ కాడలు, సెలెరీ, దోసకాయ వంటి పచ్చి కూరగాయలు, ఆకు కూరలు ఆరోగ్యానికి మంచి చేస్తాయి. శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. ఈ కూరగాయలు, ఆకు కూరలను రోజువారీ ఆహారంలో గానీ, సలాడ్ రూపంలో గానీ తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

3. డ్రై ఫ్రూట్స్, నట్స్..

ఎండుద్రాక్ష, ఖర్జూరం, బాదం, వాల్‌నట్‌లు, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ చాలా ఆరోగ్యకరమైనవి. ఇందులో అనేక విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్, పర్యావరణ హాని నుండి రక్షిస్తాయి. ఇవి కొల్లాజెన్‌ను పెంచడంలో, చర్మం మెరుపును నిలుపుకోవడంలో కూడా సహాయపడతాయి. రోజూ కొన్ని డ్రై ఫ్రూట్స్, వాల్ నట్స్ తింటే.. మంచి ప్రయోజనం ఉంటుంది.

4. అల్లం, నిమ్మకాయ..

నిమ్మకాయ శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. అజీర్తి సమస్యలను కూడా తగ్గిస్తుంది. అల్లంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మంలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం సొంతమవుతుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి తాగాలి. అలా కాకుండా కొన్ని చుక్కల నిమ్మరసం, అల్లంతో లెమన్ టి చేసుకుని తాగవచ్చు.

5. విటమిన్ సి సమృద్ధిగా ఉండే పండ్లు..

డిటాక్స్ డైట్‌లో విటమిన్ సి ఉన్న పండ్లను తీసుకోవాలి. సి విటమిన్ ఉన్న పండ్లను తీసుకోవడం వల్ల చర్మానికి మేలు జరుగుతుంది. ఆరోగ్యకరమైన పండ్లు తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. నారింజ, ఆపిల్, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ వంటి పండ్లు శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో అద్భుతంగా పని చేస్తాయి. చర్మాన్ని మృదువుగా, బొద్దుగా ఉంచడానికి సహాయపడుతాయి. ఈ పండ్లన్నింటిలోనూ డైటరీ ఫైబర్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం దెబ్బతినకుండా నిరోధిస్తాయి. చర్మం మెరుపు పెరగాలంటే వీటిని స్నాక్స్‌గా తీసుకొవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles