AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Cable Bridge: వారి కక్కుర్తే 141 మంది ప్రాణాలు బలిగొంది.. కేబుల్ బ్రిడ్జి ఘటనపై వెలుగులోకి సంచలన విషయాలు..

గుజరాత్‌ లోని మోర్బీ కేబుల్‌ బ్రిడ్జ్‌ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Gujarat Cable Bridge: వారి కక్కుర్తే 141 మంది ప్రాణాలు బలిగొంది.. కేబుల్ బ్రిడ్జి ఘటనపై వెలుగులోకి సంచలన విషయాలు..
Morbi Cable Bridge
Shiva Prajapati
|

Updated on: Oct 31, 2022 | 3:24 PM

Share

గుజరాత్‌ లోని మోర్బీ కేబుల్‌ బ్రిడ్జ్‌ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాంట్రాక్టర్ల కక్కుర్తి కారణంగానే ఈ ఘటన జరిగినట్లు నిర్ధారించారు. కాంట్రాక్ట్ కంపెనీ అయిన ఒరెవా కంపెనీ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అవును, కేబుల్ బ్రిడ్జిపై వెళ్లడానికి కేవలం 125 మందికి మాత్రమే అనుమతి ఉంది. కానీ, కెపాసిటికీ మించి సందర్శకులను పంపించారు నిర్వాహకులు. డబ్బులకు కక్కుర్తిపడి ఏకంగా 500 మందిని అనుమతించడంతోనే ఈ ప్రమాదం జరిగింది. సందర్శకుల నుంచి ఒక్కొక్కరి నుంచి రూ. 17 చోప్పునర వసూలు చేసి బ్రిడ్జి పైకి అనుమతి ఇచ్చినట్లు విచారణలో తేలింది. అంతేకాదు.. షెడ్యూల్ కంటే ముందే సందర్శకుల కోసం వంతెనను ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. అసలే పాత బ్రిడ్జి, అందులోనూ మరమ్మతలు చేసిన అనంతరం సందర్శకుల అనుమతికి మున్సిపల్, ఫైర్ సిబ్బంది నుంచి సేఫ్టీ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు. ఇక సామర్థ్యానికి మించి సందర్శకులను పంపడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే 141 మంది జలసమాధి అయ్యారు.

కాగా, ఈ కేసులో ఇప్పటికే 8 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాంట్రాక్టర్‌తో పాటు వంతెన దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని పోలీసులు అదుపు లోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ప్రమాదంపై గుజరాత్‌ ప్రభుత్వం ఇప్పటికే ఐదుగురు సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసింది. ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన వాళ్లను కఠినంగా శిక్షిస్తామని గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించింది. గుజరాత్‌ ముఖ్యంత్రి భూపేంద్రపటేల్‌ మోర్భిలో స్వయంగా సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. స్పీడ్‌ బోట్ల సాయంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అయితే, ప్రమాదంపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

6 నెలలు మూసివేసిన కేబుల్ బ్రిడ్జి..

మరమ్మతుల కోసం 6 నెలలుగా ఈ కేబుల్ బ్రిడ్జ్‌ని మూసివేశారు. రూ. 2 కోట్లతో వంతెన మరమ్మతులు చేసిన తరువాత ఈ నెల 25న తిరిగి వంతెనను ప్రారంభించారు. ఈ వంతెన సామర్థ్యం 100 మంది..అయితే ఆదివారం సెలవు కావడంతో పర్యాటకులు పెరిగాయి. 400 మందికి పైగా వంతెన ఎక్కడంతో ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయింది. బ్రిడ్జ్‌ కూలిన చోట 15 అడుగుల లోతు నీరు ఉంది. 100 మీటర్ల ఎత్తు నుంచి నదిలో జనం పడ్డారు. ఈ వంతెన కార్పొరేషన్‌ ఆధీనంలో ఉంది. గత కొంత కాలంగా ఒరేవా గ్రూప్‌కి నిర్వహణ బాధ్యత అప్పగించారు. మార్చి 2022 నుండి మార్చి 2037 వరకు ..15 సంవత్సరాల పాటు మున్సిపాలిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. బ్రిడ్జ్ సెక్యూరిటీ, క్లీనింగ్, మెయింటెనెన్స్, టోల్ వసూలు, స్టాఫ్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు చేస్తోంది ఒరేవా కంపెనీ.

140 ఏళ్ల చరిత్ర..

మోర్బీ బ్రిడ్జికి 140 సంవత్సరాల చరిత్ర ఉంది. నాటి ఈ కేబుల్ బ్రిడ్జ్ పొడవు సుమారు 765 అడుగులు. వెడల్పు 1.25 మీటర్లు. అంతేకాదు చారిత్రక వారసత్వ కట్టడాల జాబితాలో చేరింది ఈ వంతెన పేరు. దర్బార్గఢ్ -నజార్బాగ్ ప్రాంతాలను కలిపేలా ఈ బ్రిడ్జ్‌ని నిర్మించారు. 1879 ఫిబ్రవరి 20న ముంబై గవర్నర్ రిచర్డ్ టెంపుల్ చేతుల మీదుగా ఈ బ్రిడ్జ్‌ ప్రారంభం అయింది. అప్పట్లో రూ. 3.50 లక్షలతో వంతెన నిర్మాణం పూర్తి చేశారు. అంతేకాదు నిర్మాణానికి ఇంగ్లండ్‌ నుంచి మెటీరియల్ దిగుమతి చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..