Munugode: మునుగోడు ఉప ఎన్నిక వేళ.. జూబ్లీహిల్స్ లో భారీగా నగదు పట్టివేత..

మునుగోడు ఉప ఎన్నికకు సమయం ముంచుకొస్తోంది. ఎలాగైనా గెలిచి తీరాలని టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో వేడి పుట్టిస్తున్నాయి. ఇదంతా ఓ వైపు.. కానీ..

Munugode: మునుగోడు ఉప ఎన్నిక వేళ.. జూబ్లీహిల్స్ లో భారీగా నగదు పట్టివేత..
Money In Account
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 31, 2022 | 3:19 PM

మునుగోడు ఉప ఎన్నికకు సమయం ముంచుకొస్తోంది. ఎలాగైనా గెలిచి తీరాలని టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో వేడి పుట్టిస్తున్నాయి. ఇదంతా ఓ వైపు.. కానీ మరోవైపు మాత్రం ఓటర్లను ఆకర్షించేందుకు సరికొత్త ప్రయత్నాలకు తెర లేపుతున్నారు. ప్రలోభాలకు గురి చేసి ఓట్లు రాబట్టుకోవాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. దీంతో అక్రమంగా నగదు తరలించే వాహనాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అనుమానాస్పదంగా ఉన్న వెహికిల్స్ ను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో భారీగా నగదు బయటపడిన ఘటనలు మనం ఎన్నో చూశాం. అయితే తాజాగా.. మునుగోడు ఉప ఎన్నిక కోసం తరలిస్తున్న రూ. 89.91 లక్షల నగదును హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తుగా అందిన సమాచారం మేరకు జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యా భవన్‌ సమీపంలో దాడులు నిర్వహించగా ఓ కారులో తరలిస్తున్న నగదు పట్టుబడింది. కారులో ఉన్న వ్యక్తిని కడారి శ్రీనివాస్‌గా గుర్తించారు. ఆయన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వ్యక్తిగత సహాయకుడు జనార్దన్‌కు డ్రైవర్‌గా గుర్తించారు. కారు, నగదును స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.

అయితే.. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా నార్సింగి వద్ద కోటి, ఇబ్రహీంపట్నం వద్ద 65 లక్షల రూపాయలు పోలీసులు పట్టుకున్నారు. నార్సింగి వద్ద పట్టుబడ్డ కోటి రూపాయల తరలింపు వెనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బంధువులు ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వనస్థలిపురం ఎన్జీవో కాలనీకి చెందిన దేవర్ రాజు, కార్వాన్ కు చెందిన శ్రీకాంత్ సాగర్ వెంకట్ ఫామ్స్ లో అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. ఈ హవాలా డబ్బులను మునుగోడుకు తరలిస్తున్నట్లు పోలీసులు విచారణలో బయట పడింది.

మునుగోడుకు ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో వాహనాన్ని తనిఖీ చేయగా నగదుతో దొరికిపోయారు. సొమ్ము తీసుకువెళ్తున్న వ్యక్తులు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలు నిర్వహించారు. బీజేపీకి చెందిన ఓ నేత వాహనంలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని మునుగోడు ఉప ఎన్నికల వార్తల కోసం