TS SSC Exams: నేటి నుంచి తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు చెల్లింపులు.. చివరి తేదీ ఇదే..

తెలంగాణ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్ధులకు పబ్లిక్‌ పరీక్షలు 2022-23 వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్నట్లు సెకండరీ స్కూల్‌ బోర్డు డైరెక్టర్‌ కృష్ణారావు..

TS SSC Exams: నేటి నుంచి తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు చెల్లింపులు.. చివరి తేదీ ఇదే..
TS 10th class exam fees
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 31, 2022 | 2:55 PM

తెలంగాణ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్ధులకు పబ్లిక్‌ పరీక్షలు 2022-23 వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్నట్లు సెకండరీ స్కూల్‌ బోర్డు డైరెక్టర్‌ కృష్ణారావు అక్టోబర్‌ 29న వెల్లడించారు. ఈ సందర్భంగా పరీక్షల ఫీజుల చెల్లింపులకు సంబంధించిన టైం టేబుల్‌ విడుదల చేశారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాసే విద్యార్థులు రూ.125ల చొప్పున పరీక్ష ఫీజును తాము చదువుతున్న పాఠశాలల్లోనే చెల్లించాలని ఆయన సూచించారు. ఎటువంటి ఆలస్య రుసుములేకుండా అక్టోబర్‌ 31 నుంచి నవంబరు 15 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. డిసెంబరు 29 వరకు రూ.50, రూ.200, రూ.500ల ఆలస్యరుసుముతో ఫీజులు చెల్లించడానికి అవకాశం ఉందని తెలిపారు. అంతేకాకుండా ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభంలో విడుదల చేసిన అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారంగానే పరీక్షలు జరుగుతాయని ఆయన అన్నారు. ఈ మేరకు మార్చి చివరి వారంలో పరీక్షలు మొదలయ్యే అవకాశం ఉందని అన్నారు.

ఐతే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు11 పేపర్లకు బదులు ఆరు పరీక్షలకే ఉంటాయని స్పష్టం చేశారు. ఒక్కో సబ్జెక్టుకు ఒక పేపర్‌ మాత్రమే ఉంటుందని బోర్డు డైరెక్టర్‌ కృష్ణారావు అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.