TS EAMCET 2022 Spot Admission: తెలంగాణ ఎంసెట్‌-2022 స్పాట్ అడ్మిషన్‌ షెడ్యూల్‌ విడుదల..

తెలంగాణ ఎంసెట్-2022 స్పాట్ అడ్మిషన్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ప్రైవేట్‌ కాలేజీల్లో సీట్లు పొందగోరే విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసకోవల్సిందిగా..

TS EAMCET 2022 Spot Admission: తెలంగాణ ఎంసెట్‌-2022 స్పాట్ అడ్మిషన్‌ షెడ్యూల్‌ విడుదల..
TS EAMCET 2022 Spot Admission
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 30, 2022 | 12:09 PM

తెలంగాణ ఎంసెట్-2022 స్పాట్ అడ్మిషన్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ప్రైవేట్‌ కాలేజీల్లో సీట్లు పొందగోరే విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసకోవల్సిందిగా సూచించింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 31న ఇంటర్నల్‌ స్లయిడింగ్ జరుగుతుంది. నవంబర్ 3 వరకు స్పాట్ అడ్మిషన్‌ ప్రక్రియ కొనసాగనుంది. ఖాళీగా ఉన్న సీట్లను ముందుగా ఇంటర్నల్ స్లైడింగ్‌ అభ్యర్ధులకు కేటాయిస్తారు. అనంతరం మిగిలిపోయిన సీట్లను స్పాట్‌ అడ్మిషన్ల కింద కేటాయించడం జరుగుతుంది.

స్పాట్ అడ్మిషన్ల వెరిఫికేషన్ కోసం అభ్యర్ధులు తప్పనిసరిగా అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేని అభ్యర్థులకు స్పాట్ అడ్మిషన్లకు అనుమతి ఉండదు. నిర్ణీత కాల వ్యవధి అనంతరం ఒరిజినల్ సర్టిఫికేట్లను తిరిగి ఆయా విద్యార్ధులకు అందజేయడం జరుగుతుంది. కాగా గత మంగళవారం (అక్టోబర్‌ 25)తో ఎంసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ ముగిసింది. దీంతో దాదాపు 63,899 మందికి సీట్లు లభించాయి. మొత్తం 79,346 బీటెక్‌ సీట్లలో15,447 సీట్లు మిగిలిపోయినట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.