TSPSC AEE 2022 exam date: టీఎస్పీయస్సీ1540 ఏఈఈ పోస్టులకు రాతపరీక్ష తేదీ విడుదల.. ఎప్పుడంటే..
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఇంజనీరింగ్ సర్వీసుల్లో 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి రాత పరీక్ష తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది (2023)..
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఇంజనీరింగ్ సర్వీసుల్లో 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి రాత పరీక్ష తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది (2023) జనవరి 22వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థులు పరీక్ష తేదీకి వారం రోజుల ముందు వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. కాగా ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 న విడుదలైంది. అదేనెల 22 నుంచి అక్టోబర్ 15, 2022వ తేదీ వరకు టీఎస్పీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించింది.
పోస్టుల వివరాలు ఇవే..
- ఏఈఈ(సివిల్)- పీఆర్ అండ్ ఆర్‌డీ డిపార్ట్‌మెంట్ (మిషన్ భగీరథ) పోస్టులు: 302
- ఏఈఈ(సివిల్)- పీఆర్ అండ్ ఆర్‌డీ డిపార్ట్‌మెంట్ పోస్టులు: 211
- ఏఈఈ (సివిల్) ఎంఏ అండ్ యూడీ- పీహెచ్ పోస్టులు: 147
- ఏఈఈ(సివిల్) టీడబ్ల్యూ డిపార్ట్‌మెంట్ పోస్టులు: 15
- ఏఈఈ ఐ అండ్ సీఏడీ డిపార్ట్‌మెంట్ పోస్టులు: 704
- ఏఈఈ (మెకానికల్) ఐ అండ్ సీఏడీ(జీడబ్ల్యూడీ) పోస్టులు: 3
- ఏఈఈ (సివిల్) టీఆర్ అండ్ బి పోస్టులు: 145
- ఏఈఈ (ఎలక్ట్రికల్) టీఆర్ అండ్ బి పోస్టులు: 13
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.