Gujarat: గుజరాత్‌లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన సస్పెన్షన్ బ్రిడ్జ్.. నదిలో పడ్డ 400 మంది..!

గుజరాత్‌‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మోర్బీ ప్రాంతంలో సస్పెన్షన్ బ్రిడ్జి కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఉన్న దాదాపు 400 మంది సందర్శకులు నదిలో పడినట్లు తెలుస్తుంది.

Gujarat: గుజరాత్‌లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన సస్పెన్షన్ బ్రిడ్జ్.. నదిలో పడ్డ 400 మంది..!
Morbi Suspension Bridge
Follow us

|

Updated on: Oct 30, 2022 | 8:55 PM

గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్భి దగ్గర తీగల వంతెన కుప్పకూలింది. పెద్ద సంఖ్యలో సందర్శకులు నదిలో పడిపోయారు. బ్రిటీష్‌ కాలం నాటి వంతెనను రిపేర్ల తరువాత ఐదు రోజుల క్రితమే రీ ఓపెన్‌ చేశారు. కెపాసిటీకి మించి జనం వంతెన పైకి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వాళ్లను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాద సమయంలో వంతెనపై 400 మంది ఉన్నట్టు తెలుస్తోంది. కొంతమంది ఈదుకుంటూ బయటకు వచ్చారు. చిన్నారులు , మహిళలు మాత్రం బయటకు రాలేకపోయారు. సంఘటనా స్థలానికి 20 అంబులెన్స్‌లను రప్పంచారు. ప్రాణాలు కాపాడాలని జనం ఆర్తనాదాలు మిన్నంటాయి. చిన్నారులు , మహిళలు కూడా ఎత్తైన వంతెన పై నుంచి నదిలో పడిపోయారు.

ఈ ప్రమాదంపై గుజరాత్‌ పర్యటన లోనే ఉన్న ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గుజరాత్‌ సీఎం భూపేంద్రపటేల్‌తో ఫోన్లో మాట్లాడారు మోదీ. బాధితులను అన్నివిధాలా ఆదుకోవాలని సూచించారు. ఈ ప్రమాదంపై గుజరాత్‌ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ డిమాండ్‌ చేసింది. రిపేర్‌ చేసిన ఐదు రోజులకే వంతెన కూలడంపై సీఎం భూపేంద్ర పటేల్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసింది.

మచ్చూ నదిపై ఈ కేబుల్‌ బ్రిడ్జిని నిర్మించారు. బ్రిటీష్‌ కాలంలో ఈ వంతెనను నిర్మించారు. అయితే రిపేర్ల తరువాత ఈనెల 26వ తేదీన గుజరాత్‌ కొత్త సంవత్సరం సందర్భంగా ఓపెన్‌ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.