Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pregnant Diet: గర్భిణీ స్త్రీలు అన్నం తింటే ప్రమాదమా.. వైట్ రైస్ తినాలా బ్రౌన్ రైస్ తీసుకోవాలా.. నిపుణులు ఏమంటున్నారంటే..

ఓ మహిళ తల్లి అవ్వడం చాలా అపురూపమైన ఘట్టం. మాతృత్వపు మధురిమను ఆస్వాదించేందుకు ప్రతి స్త్రీ ఎంతగానో ఎదురుచూస్తుంటుంది. తాను గర్భం దాల్చానని తెలియగానే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతుంది...

Pregnant Diet: గర్భిణీ స్త్రీలు అన్నం తింటే ప్రమాదమా.. వైట్ రైస్ తినాలా బ్రౌన్ రైస్ తీసుకోవాలా.. నిపుణులు ఏమంటున్నారంటే..
Pregnant Woman
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 31, 2022 | 8:38 PM

ఓ మహిళ తల్లి అవ్వడం చాలా అపురూపమైన ఘట్టం. మాతృత్వపు మధురిమను ఆస్వాదించేందుకు ప్రతి స్త్రీ ఎంతగానో ఎదురుచూస్తుంటుంది. తాను గర్భం దాల్చానని తెలియగానే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతుంది. త్వరలోనే అమ్మను కాబోతున్నానని పట్టరాని సంతోషంతో ఉంటుంది. అందుకే గర్భం అనేది స్త్రీ జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ. తల్లి తన బిడ్డకు మంచి జరగాలని కోరుకుంటుంది. కడుపులో పెరుగుతున్న శిశువుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడంపై దృష్టి పెడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దశలో ఏయే పదార్థాలు తినాలో, తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భధారణ సమయంలో అన్నం తీసుకోవడాన్ని సాధారణంగా హానికరంగా నిపుణులు పరిగణిస్తారు. అయితే ఈ సమయంలో మితమైన పరిమాణంలో అన్నం తినడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు.అధిక పరిమాణంలో రైస్ తీసుకుంటే అది బరువు పెరగడానికి దారి తీస్తుంది. ఇది చివరికి డెలివరీ, సిజేరియన్ డెలివరీ, పిల్లల్లో ఊబకాయం వంటి సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి, గర్భిణీ స్త్రీలు కొద్ది మొత్తంలో మాత్రమే అన్నం తినాలి. ఇది వారికే కాకుండా పుట్టబోయే బిడ్డకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఏ రకం అన్నం తల్లికి మేలు చేస్తుందనే విషయంలో చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. వైట్ లేదా బ్రౌన్ రైస్ తినాలా అని ఆలోచిస్తుంటారు. అయితే రెండు రకాల బియ్యాన్ని డైట్ లో భాగం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బియ్యంలో ఉండే మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, రిబోఫ్లావిన్, థయామిన్, విటమిన్ డి వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. వీటిలోని ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు శరీరానికి బలాన్ని అందిస్తాయి. బ్రౌన్ రైస్‌కు అదనపు ప్రయోజనం ఉంది. శరీరానికి పోషకాలను అందించడమే కాకుండా జీర్ణక్రియ సాఫీగా జరగడానికి, గర్భం వల్ల కలిగే మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

ఈ ప్రయోజనాలకు అదనంగా బియ్యంలోని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ మెరుగైన ఇన్సులిన్ నియంత్రణను నిర్ధారిస్తుంది. ఈ ప్రయోజనం పొందడానికి బియ్యాన్ని మితంగా తీసుకోవాలి. స్వచ్ఛమైన, సురక్షితమైన నీటిని తాగాలి. రక్తంలో చక్కెర స్థాయిలపై వాటి ప్రభావాన్ని బట్టి ఆహారాన్ని తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా గర్భధారణ సమయాన్ని మంచి జ్ఞాపకంగా పదిలపరచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..