Banks FD Rates Hike: గుడ్ న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను భారీగా పెంచిన 4 బ్యాంకులు.. పూర్తి వివరాలివే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వరుసగా రెపో రేటు పెంచిన తర్వాత, బ్యాంకులు మే 2022 నుండి ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD), సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వరుసగా రెపో రేటు పెంచిన తర్వాత, బ్యాంకులు మే 2022 నుండి ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD), సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, RBL బ్యాంక్‌లు ఇటీవల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. తాజాగా ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, ఆర్‌బిఎల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 7 శాతం కంటే ఎక్కువగా పెంచాయి. ఇది సదరు బ్యాంకు కస్టమర్లకు, పెట్టుబడి పెట్టబోయే కస్టమర్లకు నిజంగా శుభవార్తే అని చెప్పాలి. మరి ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేటు ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
IDFC ఫస్ట్ బ్యాంక్ ఫిక్స్‌డిపాజిట్లపై వడ్డీ రేట్లు..
IDFC ఫస్ట్ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు FDని అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు ఈ డిపాజిట్లపై 50 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) అదనంగా పొందుతారు. 750 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు బ్యాంక్ సాధారణ కస్టమర్‌లకు 7.25%, సిటిజన్‌లకు 7.75% అందిస్తుంది.
RBL బ్యాంక్ ఫిక్స్‌డిపాజిట్లపై వడ్డీ రేట్లు..
RBL బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 15 నెలల్లో మెచ్యూర్ అయ్యే FDలపై 7% వడ్డీని అందిస్తుంది. ఈ అవధిలో, సీనియర్ సిటిజన్లకు 7.50% రేటు ఇస్తోంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డిపాజిట్లపై వడ్డీ రేట్లు..
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీలతో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3% నుండి 7% వరకు వడ్డీని అందిస్తుంది. ఇది అక్టోబరు 17 నుండి అమలులోకి వచ్చింది.
కెనరా బ్యాంక్ ఫిక్స్‌డిపాజిట్లపై వడ్డీ రేట్లు..
కెనరా బ్యాంక్ 666 రోజుల కాలవ్యవధితో ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ప్రకారం.. బ్యాంకు తన సాధారణ కస్టమర్లకు 7% వడ్డీ రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు ఈ డిపాజిట్లపై 7.5% వడ్డీ రేటును అందిస్తుంది. దీంతోపాటు.. 7 రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా పెంచింది. సాధారణ కస్టమర్లకు 3.25 నుంచి శాతం నుంచి 7.50 శాతం వరకు అందిస్తోంది. బ్యాంక్ ప్రకారం కొత్త రేట్లు 7 అక్టోబర్ 2022 నుంచి అమల్లోకి వచ్చాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..