Andhra Pradesh: ‘రాజీకొస్తావా? చస్తావా?’.. అధికార మదంతో రెచ్చిపోయిన ఎస్ఐ.. అయినా తగ్గని రైతు..

ఫిర్యాదు వెనక్కి తీసుకుంటావా లేక చస్తావా అంటూ ఓ రైతుకు ఎస్ఐ చేసిన హెచ్చరికలు కర్నూలు జిల్లాలో సంచలనంగా మారాయి. అయితే, తనను బెదిరించిన సదరు ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలంటూ బాధిత రైతు..

Andhra Pradesh: ‘రాజీకొస్తావా? చస్తావా?’.. అధికార మదంతో రెచ్చిపోయిన ఎస్ఐ.. అయినా తగ్గని రైతు..
Kurnool Farmer
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 30, 2022 | 6:22 PM

ఫిర్యాదు వెనక్కి తీసుకుంటావా లేక చస్తావా అంటూ ఓ రైతుకు ఎస్ఐ చేసిన హెచ్చరికలు కర్నూలు జిల్లాలో సంచలనంగా మారాయి. అయితే, తనను బెదిరించిన సదరు ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలంటూ బాధిత రైతు.. సీఐ కి ఫిర్యాదు చేశారు. దాంతో ఎస్ఐ పై విచారణ జరుపుతున్నారు ఉన్నతాధికారులు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం వరిముక్కల గ్రామ పరిధిలో సిఐడిలో సీఐగా పనిచేస్తున్న కౌలుట్ల కి, రైతు హరికృష్ణ కి ఒకే చోట పొలం ఉంది. పొలం అమ్ము లేకపోతే నా పొలం నుంచి రాస్తా ఇవ్వను అంటూ హరికృష్ణ కి సీఐ కౌలుట్ల పలుసార్లు బెదిరించాడు. ఈ బెదిరింపులపై దేవనకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు రైతు హరికృష్ణ. రైతు ఫిర్యాదు మేరకు సీఐ కౌలుట్ల పై కేసు నమోదు అయింది. అయితే ఈ కేసుకు సంబంధించి రాజీ అవుతావా లేక చస్తావా అంటూ దేవనకొండ ఎస్ఐ భూపాలుడు.. ఫిర్యాదుదారుడు అయిన హరికృష్ణను స్టేషన్‌కు పిలిపించి బెదిరించడం మొదలుపెట్టాడు. ఎస్ఐ బెదిరింపులను బాధితులు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు.

అయితే, ఎస్ఐ బెదిరింపులకు ఏమాత్రం భయపడని రైతు హరికృష్ణ.. పక్కా సాక్ష్యాలతో ఎస్ఐ భూపాలుడిపై పత్తికొండ సిఐ రామకృష్ణా రెడ్డికి ఫిర్యాదుు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సిఐ విచారణ చేపట్టారు. తమను బెదిరిస్తూ, భయబ్రాంతులకు గురి చేస్తున్న ఎస్ఐ భూపాలుడు, సీఐ కౌలుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత రైతు హరికృష్ణ, అతని కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.

వరిముక్కల గ్రామంలో హరికృష్ణకు1.50 ఎకరాల భూమి ఉండగా సిఐ కౌలుట్లకు రెండు ఎకరాల భూమి ఉంది. హరికృష్ణ తన పొలంలోకి వెళ్లాలంటే కౌలుట్ల పొలం మీదుగా వెళ్ళాలి. ఇదే అదునుగా తీసుకొని పొలం అమ్మాలి.. లేదంటే దారి ఇవ్వను అంటూ బెదిరించసాగాడు దీనిపైనే సీఐ కౌలుట్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇలా తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఒక సామాన్య రైతును బెదిరించిన ఎస్ఐ, సీఐ పై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వారి బెదిరింపులపై విచారణ చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..