Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanipakam: వరసిద్ధి వినాయక ఆలయంలో విభూదిపట్టి మాయంపై వివాదం.. అసలు సంగతి ఇలా తెలిసింది..

ఇప్పుడు విరాళమిచ్చిన దాత దానికి సంబంధించిన రసీదు అడగడంతో.. విభూది పట్టి మిస్సైన విషయం వెలుగులోకి వచ్చింది.

Kanipakam: వరసిద్ధి వినాయక ఆలయంలో విభూదిపట్టి మాయంపై వివాదం.. అసలు సంగతి ఇలా తెలిసింది..
Kanipakam Vinayaka Temple
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 30, 2022 | 6:36 PM

కాణిపాకం ఆలయ ఉప ప్రధాన అర్చకుడిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది దేవాదాయ శాఖ. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బంగారు విభూది పట్టి మాయంపై ధర్మేష్‌ గురుకుల్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆగస్ట్‌ 27న మహాకుంభాభిషేకం సమయంలో 18లక్షల విలువైన విభూది పట్టిని కానుకగా ఇచ్చారు వేలూరు గోల్డెన్‌ టెంపుల్‌ వ్యవస్థాపకులు అమ్మన్‌ శక్తి నారాయణి. అయితే అప్పుడు వారికి రసీదు ఇవ్వలేదు. ఇప్పుడు విరాళమిచ్చిన దాత దానికి సంబంధించిన రసీదు అడగడంతో.. విభూది పట్టి మిస్సైన విషయం వెలుగులోకి వచ్చింది.

20 రోజుల క్రితం విభూదిపట్టి మాయమైన విషయం..తన దృష్టికి రావడంతో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దీనిపై విచారణ జరిపిస్తామని చెప్పారు. ఇవాళ ఆలయ ఉప ప్రధాన అర్చకుడిని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఐతే బంగారు విభూదిపట్టిని ఆలయంలోని భాండాగారంలో భద్రపరిచానన్న అర్చకుడు..ఆలయ ఈవోకి ఆభరణాన్ని అప్పగించారు.

కానుకగా వచ్చిన ఆభరణానికి రసీదు ఇవ్వడంలో ఎందుకు డిలే జరిగిందన్న అంశంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామంటున్నారు ఆలయ అధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం