Interesting Facts: కొబ్బరి బొండాం నుంచి నేరుగా నీళ్లను తాగుతున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!

కొబ్బరి నీళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొబ్బరి నీటిలో అనేక పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ప్రతి రోజ ఒక కొబ్బరి బొండాం తాగితే అనేక ప్రయోజనాలు అందుతాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీర ఆరోగ్యమే కాకుండా.. చర్మ, జుట్టు సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. పలు రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా..

Interesting Facts: కొబ్బరి బొండాం నుంచి నేరుగా నీళ్లను తాగుతున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
Interesting Facts
Follow us

|

Updated on: Jul 04, 2024 | 12:44 PM

కొబ్బరి నీళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొబ్బరి నీటిలో అనేక పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ప్రతి రోజ ఒక కొబ్బరి బొండాం తాగితే అనేక ప్రయోజనాలు అందుతాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీర ఆరోగ్యమే కాకుండా.. చర్మ, జుట్టు సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. పలు రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. అయితే కొబ్బరి నీటిని చాలా మంది నేరుగా బొండాం నుంచి తాగుతూ ఉంటారు. ఇలా అస్సలు తాగకూడదని తాజాగా చేసిన పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కొబ్బరి నీళ్లను ఓ గ్లాసు లేదా ఇతర ఏదైనా పాత్రలో వేసుకుని తాగాలట. కొబ్బరి నీళ్లు నేచురల్‌గా వచ్చినా అందులో కూడా మలినాలు అనేవి ఉంటాయి. అలా నీళ్ళు తాగడం వల్ల అలర్జీలు, శ్వాస కోశ సమస్యలు తలఎత్తవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఫంగస్ ఏర్పడవచ్చు..

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిదే. కానీ ఎలా తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యమే. కొబ్బరి నీళ్లు తాగితే శరీరం చల్లబడుతుంది. ముఖ్యంగా యూరినరీ ఇన్ ఫెక్షన్స్ ఏమైనా ఉంటే త్వరగా కంట్రోల్ అవుతాయి. ఈ నీటిలో మాంగనీస్, క్యాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే కొబ్బరి బొండాం లోపల ఎలా ఉందో చెప్పలేం. ఒక్కోసారి బొండాం లోపల ఫంగస్ వంటివి కూడా ఏర్పడవచ్చు. అది తెలీక మనం తాగడం వల్ల అనేక వ్యాధులు రావచ్చు.

సూక్ష్మ జీవులు ఎక్కువగా చేరతాయి..

కొబ్బరి బొండాంలో ఎక్కువగా మోల్డ్ అనే సూక్ష్మ జీవులు ఎక్కువగా చేరుతూ ఉంటాయి. వీటిని ఫంగస్ అని కూడా పిలుచుకోవచ్చు. ఇవి తడిగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి కొబ్బరి నీటిని ఒక గ్లాసులో వేసుకుని.. ఎలాంటి నల్లటి పదార్థాలు లేకపోతేనే తాగాలి. ఈ సూక్ష్మ జీవుల వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కళ్లు ఎరుపుగా మారడం, తుమ్ములు, ముక్క నుంచి నీరు కారడం, ముక్కులో దురద రావడం, చర్మంపై దద్దుర్లు, దురద రావడం ఇలాంటి వస్తాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!
అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!
కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..
కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!
ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.
ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.