AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే చౌకైన TB టెస్ట్ కిట్‌ను తయారు చేసిన భారత్.. తక్కువ సమయంలో రిజల్ట్..ధర ఎంతంటే

క్షయవ్యాధి అనేది మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ బ్యాక్టీరియా వల్ల కలిగే అంటు వ్యాధి. ఈ బ్యాక్టీరియా సాధారణంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ TB శరీరంలోని ఇతర భాగాలకు కూడా సోకవచ్చు. క్షయవ్యాధి బారిన పడిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. అప్పుడు ఆ బ్యాక్టీరియా గాలి ద్వారా మరొక వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది.

ప్రపంచంలోనే చౌకైన TB టెస్ట్ కిట్‌ను తయారు చేసిన భారత్.. తక్కువ సమయంలో రిజల్ట్..ధర ఎంతంటే
Tuberculosis Test KitImage Credit source: boonchai wedmakawand/Moment/Getty Images
Surya Kala
|

Updated on: Jul 04, 2024 | 11:36 AM

Share

క్షయవ్యాధి (TB) అనేది దశాబ్దాల నాటి వ్యాధి. కాలక్రమంలో వైద్యంలో వచ్చిన మార్పుల్లో భాగంగా ఈ ప్రాణాంతక వ్యాధి విజృంభణ క్రమంగా తగ్గుముఖం పట్టినా.. ఈ వ్యాధి కేసులు భారతదేశంలో ప్రతి సంవత్సరం నమోదవుతున్నాయి. క్షయవ్యాధి విషయంలో అతి పెద్ద సమస్య ఏమిటంటే ఈ వ్యాధిని సకాలంలో గుర్తించలేకపోవడమే. అయితే ఇక నుంచి ఈ సమస్య కూడా తీరనుంది. టీబీని ముందుగా గుర్తించేందుకు ఐసీఎంఆర్ కొత్త టెక్నాలజీని కనుగొంది. దీని ద్వారా కేవలం 2 గంటల్లో టీబీని గుర్తించే టెస్ట్ కిట్‌ను తయారు చేశారు. ఈ కిట్ ధర కేవలం రూ.35 మాత్రమే. కొత్త సాంకేతికతతో.. 1500 కంటే ఎక్కువ శాంపిల్స్ ను ఏకకాలంలో పరీక్షించవచ్చు.

క్షయవ్యాధి అనేది మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ బ్యాక్టీరియా వల్ల కలిగే అంటు వ్యాధి. ఈ బ్యాక్టీరియా సాధారణంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ TB శరీరంలోని ఇతర భాగాలకు కూడా సోకవచ్చు. క్షయవ్యాధి బారిన పడిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. అప్పుడు ఆ బ్యాక్టీరియా గాలి ద్వారా మరొక వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ ఇన్ఫెక్షన్ త్వరగా సోకుతుంది. TB ప్రధాన లక్షణాలు నిరంతర దగ్గు, జ్వరం, బరువు తగ్గడం. నిరంతర అలసట.

టీబీ టెస్ట్ కిట్‌ను సిద్ధం చేసిన ఐసీఎంఆర్

ఇవి కూడా చదవండి

గ్లో TB PCR కిట్ అనేది రోగి శాంపిల్ నుంచి DNA ను వేరు చేయగల సాంకేతికత. ఈ కిట్ CRISPR సాంకేతికతపై పనిచేస్తుంది. ఇది జన్యు సవరణ సాధనం. ఈ కిట్‌తో అన్ని DNA నమూనాలను వేగంగా ప్రాసెస్ చేయవచ్చు. డీఎన్‌ఏ, టీబీ బాక్టీరియాను వేరు చేసే ప్రక్రియ తర్వాత ఈ కిట్‌తో శరీరంలోని టీబీ బ్యాక్టీరియాను పరీక్షిస్తారు. తద్వారా శరీరంలో టీబీ బ్యాక్టీరియా ఉందా లేదా అనేది కేవలం 2 గంటల్లోనే తెలిసిపోతుంది.

ఈ సాంకేతికత ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందంటే

ఈ రెండు టెక్నాలజీలను మార్కెట్‌లోకి తీసుకురావడానికి ఐసీఎంఆర్ ప్రైవేట్ కంపెనీల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. అయితే ఈ సాంకేతికతకు సంబంధించిన యాజమాన్య హక్కులు మాత్రం ICAR వద్ద ఉంటాయి. ఇప్పటికే ఇన్స్టిట్యూట్ ఈ సాంకేతికతలకు సంబంధించిన పేటెంట్ హక్కులను పొందేందుకు ప్రోసేన్ ను ఇప్పటికే ప్రారంభించింది. ఏ కంపెనీ అయినా సరే ఈ కిట్‌ను మార్కెట్‌లోకి కేవలం రూ.35 ధరకే రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఈ చౌక కిట్‌తో టీబీని సులభంగా గుర్తించవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..