Gupta Navratri: గుప్త నవరాత్రి పూజ శుభ సమయం, కలశాన్ని ఏర్పాటు చేయడానికి నియమాలు ఏమిటంటే

ఆషాఢ గుప్త నవరాత్రి 2024 జూలై 06వ తేదీ శనివారం ప్రారంభమై జూలై 15వ తేదీ సోమవారం ముగుస్తాయి. ఈ గుప్త నవరాత్రులలో దుర్గాదేవి 9 రూపాలను పూజిస్తారు. నవరాత్రులు సంవత్సరానికి 4 సార్లు వస్తాయి. ప్రతి నవరాత్రికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది. తాంత్రిక ధ్యానం చేసే వారికి ఈ గుప్త నవరాత్రులు అత్యంత ప్రత్యేకమైనవి. గుప్త నవరాత్రులలో ఆచారాలు, మంత్ర తంత్రాలతో దుర్గాదేవిని పూజించడం ద్వారా అన్ని రకాల వ్యాధులు, దుఃఖాలు, దోషాలు తొలగిపోతాయని నమ్మకం.

Gupta Navratri: గుప్త నవరాత్రి పూజ శుభ సమయం, కలశాన్ని ఏర్పాటు చేయడానికి నియమాలు ఏమిటంటే
Gupta Navaratrulu
Follow us

|

Updated on: Jul 04, 2024 | 9:41 AM

హిందూ మతంలో నవరాత్రులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ నవరాత్రులను ఏడాదికి నాలుగు సార్లు జరుపుకుంటారు. ఆషాఢ మాసంలో జరుపుకునే నవరాత్రులను గుప్త నవరాత్రులు అని అంటారు. ఈ ఏడాది గుప్త నవరాత్రులు ఆషాఢ మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నుంచి ప్రారంభం కానున్నాయి. అంటే ఆషాఢ గుప్త నవరాత్రి 2024 జూలై 06వ తేదీ శనివారం ప్రారంభమై జూలై 15వ తేదీ సోమవారం ముగుస్తాయి. ఈ గుప్త నవరాత్రులలో దుర్గాదేవి 9 రూపాలను పూజిస్తారు. నవరాత్రులు సంవత్సరానికి 4 సార్లు వస్తాయి. ప్రతి నవరాత్రికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది. తాంత్రిక ధ్యానం చేసే వారికి ఈ గుప్త నవరాత్రులు అత్యంత ప్రత్యేకమైనవి. గుప్త నవరాత్రులలో ఆచారాలు, మంత్ర తంత్రాలతో దుర్గాదేవిని పూజించడం ద్వారా అన్ని రకాల వ్యాధులు, దుఃఖాలు, దోషాలు తొలగిపోతాయని నమ్మకం. గుప్త నవరాత్రుల మొదటి రోజున కలశ స్థాపన చేస్తారు. ఈ కలశ స్థాపనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే సకల దేవతలు ఈ కలశంలో కొలువై ఉంటారని విశ్వాసం.

దశాబ్దాల తర్వాత పునర్వసు నక్షత్రంలో ఈ ఏడాది గుప్త నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. గుప్త నవరాత్రులలో దుర్గాదేవిని 10 మహావిద్యలను తాంత్రిక పద్ధతిలో పూజిస్తారు. నవరాత్రి మొదటి రోజున ఘట స్థాపన చేస్తారు. అంటే కలశాన్ని స్థాపించడానికి చాలా మంది రాగి, ఇత్తడి లేదా మట్టితో చేసిన కుండని ఉపయోగిస్తారు. నవరాత్రి సమయంలో కలశానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కనుక కలశం కొత్తగా, స్వచ్ఛంగా ఉండటం చాలా ముఖ్యం. ఇది దుర్గాదేవిని సంతోషపరుస్తుంది. కోరిని కోరికలను నెరవేరుస్తుంది.

కలశాన్ని ఎలా స్థాపించాలంటే?

నవరాత్రి మొదటి రోజున పూజ సమయంలో ఏర్పాటు చేసిన కలశాన్ని పూజ ముగిసిన తర్వాత మాత్రమే తీసి ప్రవహిస్తున్న నదిలోకి విడిచిపెడతారు. అందుకే గుప్త నవరాత్రులలో మట్టితో చేసిన కలశాన్ని మాత్రమే ప్రతిష్టించాలి. ఎందుకంటే మట్టిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మట్టితో చేసిన కలశం ప్రతిష్టించిన తర్వాత ఆ కలశంలో కలువ పువ్వులు, గంగాజలం, ఎరుపు రంగు వస్త్రం, అక్షతలు వేసి కలశంపై పై కొబ్బరికాయను తప్పనిసరిగా ఉంచాలి. మట్టితో చేసిన మూతను పక్కన పెట్టుకోవాలి.

ఇవి కూడా చదవండి

కలశ స్థాపనకు అనుకూలమైన సమయం

ఆషాఢ మాసం గుప్త నవరాత్రులలో ఘాట స్థాపనకు జులై 6వ తేదీ ఉదయం 5.11 నుండి 7.26 వరకు అనుకూల సమయం. ఈ సమయంలో మీరు కలశాన్ని స్థాపించవచ్చు. ఈ ముహూర్తంలో కలశ స్థాపన కుదరకపోతే జూలై 6న అభిజీత్ ముహూర్తంలో అంటే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చేయవచ్చు. ఈ రెండు శుభ సమయాల్లో కలశ స్థాపన చేయడం శుభప్రదం.

కలశ స్థాపన నియమాలు

  1. కలశాన్ని అమర్చేటప్పుడు, మట్టి కలశంపై ఎక్కడా నల్ల మచ్చలు లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కలశంలో ఎక్కడైనా నల్ల మచ్చ ఉంటే.. దానిని సరిచేయండి. లేకపోతే పూజ ప్రభావం ప్రతికూలంగా ఉండవచ్చు.
  2. కలశాన్ని ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఏర్పాటు చేయాలి. కలశాన్ని ఇతర దిశలోనైనా ఏర్పాటు చేస్తే ఇంట్లో ప్రతికూల శక్తి నివసిస్తుందని నమ్మకం.
  3. విరిగిన లేదా పాడైన మట్టి కుండను ఎప్పుడూ ఏర్పాటు చేయవద్దు. ఇలా చేయడం వల్ల దుర్గా దేవికి అసంతృప్తి కలుగుతుంది.. ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి రావచ్చని విశ్వాసం.
  4. కలశాన్ని స్థాపించిన స్థలంలో మొత్తం 9 రోజులు పూజ చేయాలి, ఈ తొమ్మిది రోజులు పూర్తి కాకుండా పాటు పొరపాటున కూడా దాని స్థానం నుండి తొలగించకూడదు. కలశ సంస్థాపన సమయంలో మురికి నీరు, నల్ల మట్టిని ఉపయోగించవద్దు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!
అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!
కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..
కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!
ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.
ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.