Jagannath Rath Yatra: పూరీ ఆలయమే కాదు.. రథయాత్రలో కూడా ఎన్నో అద్భుతాలు.. అవి ఏమిటంటే

జగన్నాథుడు రథయాత్ర ఇప్పుడు జరుగుతున్నట్లు మొదట్లో జరిగేది కాదు. సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం వరకూ రథయాత్రను రెండు వేర్వేరు భాగాలుగా జరుపుకునేవారు. ఆ సమయంలో మూడు కాదు ఆరు రథాలను ఉపయోగించేవారు. ఆ సమయంలో జగన్నాథుడు, సుభద్ర, బల రాముడిని మూడు రథాల్లో ఉంచి పూరీ ఆలయం నుంచి గుండిచా ఆలయం వరకూ ఆ రథాలను తీసుకెళ్లారు. అయితే ఇలా అత్త ఇంటికి వెళ్లే దారిలో భారీ బలగుండి వాగు వచ్చేది. ఆలయం నుంచి మూడు రథాలను వాగు దగ్గరకు తీసుకుని వెళ్ళేవారు.

Jagannath Rath Yatra: పూరీ ఆలయమే కాదు.. రథయాత్రలో కూడా ఎన్నో అద్భుతాలు.. అవి ఏమిటంటే
Rath Yatra 2024
Follow us

|

Updated on: Jul 04, 2024 | 9:30 AM

జగన్నాథ రథోత్సవాల్లో పాల్గొనడానికి దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. రథం లాగడం కోసం భక్తులు పోటీపడతారు. రథం తాడును తాకినా చాలు అదే అదృష్టమని చెబుతారు. వందల జన్మల పాపాలు ఒక్కసారి కడిగివేయబడతాయని నమ్ముతారు. రథం, రథ చక్రం, తాడు ఇలా ఏ రథ భాగాన్ని తాకినా పాపాలు తొలగిపోతాయని.. పునర్జన్మ లభించదని విశ్వాసం. పురాతన సంప్రదాయం ప్రకారం.. ముప్పై మూడు కోట్ల మంది దేవతలు రథంలో రథోత్సవం సమయంలో అశీనులు అవుతారని విశ్వాసం. కనుక రథాన్ని అలాగే తాడును తాకడం ముప్పై మూడు కోట్ల మంది దేవతలను తాకడంతో సమానం అని భావిస్తారు.

అయితే జగన్నాథుడు రథయాత్ర ఇప్పుడు జరుగుతున్నట్లు మొదట్లో జరిగేది కాదు. సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం వరకూ రథయాత్రను రెండు వేర్వేరు భాగాలుగా జరుపుకునేవారు. ఆ సమయంలో మూడు కాదు ఆరు రథాలను ఉపయోగించేవారు. ఆ సమయంలో జగన్నాథుడు, సుభద్ర, బల రాముడిని మూడు రథాల్లో ఉంచి పూరీ ఆలయం నుంచి గుండిచా ఆలయం వరకూ ఆ రథాలను తీసుకెళ్లారు. అయితే ఇలా అత్త ఇంటికి వెళ్లే దారిలో భారీ బలగుండి వాగు వచ్చేది. ఆలయం నుంచి మూడు రథాలను వాగు దగ్గరకు తీసుకుని వెళ్ళేవారు. ఆపై జగన్నాథుడు, బలభద్రుడు, సోదరి సుభద్ర విగ్రహాలను రథాల నుండి దించి ఆ విగ్రహాలను నది దాటడానికి మూడు పడవల్లోకి తీసుకెళ్ళేవారు. కాలువ దాటిన అనంతరం అవతలివైపు ఉన్న మూడు రథాలను అధిరోహించి గుండిచా గుడికి తీసుకెళ్ళేవారు. అయితే కలాక్రమంలో రాజా కేసరి నరసింహ పూరీ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ బలగుండి వాగులో మార్పులు తీసుకుని వచ్చారు. దీంతో అప్పటి నుండి రథయాత్ర మూడు రథాలలో జరుపుకోవడం మొదలైంది.

  1. పూరీ ఆలయం గురించి కొన్ని అద్భుత సంఘటనలు ఉన్నట్లే.. రథయాత్ర గురించి కూడా వింత సంఘటనలు ఉన్నాయి. ఇవి నమ్మశక్యం కానివి అని చెప్పవచ్చు. ఆ సంఘటనలు ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. జగన్నాథుడు రథోత్సవం రోజున అనేక విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి.
  2. ప్రతి సంవత్సరం రథం రోజున వర్షాలు కురుస్తాయి. రథోత్సవం రోజున వర్షాలు కురవక పోవడం అనేది నేటి వరకూ ఒక్క సంవత్సరం కూడా జరగలేదు.
  3. ఇవి కూడా చదవండి
  4. రథాల తయారీలో వేప చెక్కను ఉపయోగిస్తారు. అయితే రథాల తయారీ కోసం ఎలాంటి ఆధునిక ఉపకరణాలు ఉపయోగించరు. చెక్క సుత్తులు ఉపయోగిస్తారు. ఈ రథం తయారీలో ఇప్పుడున్న ఆధునిక సాంకేతికతను ఇసుమంత కూడా ఉపయోగించరు.
  5. రథాలను నిర్మించడానికి నిర్దిష్ట పొడవు-రాతి పరిమాణాలు కూడా చేతితో కొలతలు తీసుకోబడతాయి. అంతే కాదు, గోర్లు, పిన్స్ లేదా నట్‌బోల్ట్‌లు వంటి ఎటువంటి లోహం వస్తువులు రథ తయరీ కోసం ఉపయోగించరు.
  6. దాదాపు 1400 మంది కళాకారులు రథాల తయారీలో పాల్గొంటారు. ఈ కళాకారులు తరతరాలుగా రథాలు తయారు చేస్తున్నారు. నేటికీ రథాలు తయారు చేస్తూనే ఉన్నారు. వారిని ఏడాది ఏడాదిగా నియమించరు. ఆచారం ప్రకారం వీరు యుగయుగాలుగా రథాలు తయారు చేస్తున్నారని విశ్వాసం.
  7. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మూడు రథాలు వేప చెక్కతో తయారు చేయబడతాయి. అయితే మూడు రథాలు లోపల దాదాపు 208 కిలోల బంగారంతో అలంకరిస్తారు.
  8. రథయాత్ర గురించి వివిధ జానపదాలు కథల్లో, వివిధ పురాణాలలో కూడా ప్రస్తావించబడింది. జగన్నాథుని గురించి అనేక జానపద నమ్మకాలు కూడా ఉన్నాయి.
  9. పూరీ రథయాత్ర ఉత్సవాన్ని బెంగాల్‌లో మహాప్రభు చైతన్యదేవ్ ప్రారంభించారు. అతను నీలాచల్ నుండి బెంగాల్ వరకు మొదటి రథయాత్రను తీసుకువచ్చాడు. ఒడిశాతో పాటు బెంగాల్‌లోనూ రథోత్సవం ప్రారంభమైంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు