AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jyeshtha Amavasya: జూలై 5 లేదా 6 జ్యేష్ట అమావాస్య ఎప్పుడు..? ఈ 2 పరిహారాలు చేయడం వలన సక్సెస్ మీ సొంతం..

జ్యేష్ట మాసంలోని అమావాస్య రోజున కూడా స్నానం దానం చేయడం ద్వారా పూర్వీకుల అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ సంవత్సరం జ్యేష్ట అమావాస్య జూలై 5 లేదా జూలై 6 న అనే సందేహం చాలా మందిలో ఉంది. ఈ రోజున ఖచ్చితమైన తేదీ గురించి తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ట మాసంలోని అమావాస్య తేదీ జూలై 5 ఉదయం 04:57 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ రోజున సూర్యోదయం ఉదయం 05:29 గంటలకు ఉంటుంది. అమావాస్య తిథి జూలై 6వ తేదీ తెల్లవారుజామున 4:26 గంటలకు ముగుస్తుంది.

Jyeshtha Amavasya: జూలై 5 లేదా 6 జ్యేష్ట అమావాస్య ఎప్పుడు..? ఈ 2 పరిహారాలు చేయడం వలన సక్సెస్ మీ సొంతం..
Jyesta Amavasya 2024
Surya Kala
|

Updated on: Jul 04, 2024 | 7:12 AM

Share

హిందూ మతంలో ప్రతి నెలలో వచ్చే అమావాస్య తిథి రోజున చేసే పూజ, స్నానం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అమావాస్య రోజున పూర్వీకులు తమ వారసులను ఆశీర్వదించడానికి భూమికి వస్తారని నమ్మకం. ఈ రోజున స్నానం చేయడం, దానం చేయడం , తర్పణం ఇవ్వడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఎందుకంటే పూర్వీకులకు తర్పణం సమర్పించడం ద్వారా.. వారు సంతోషంగా ఉంటారు. తమ కుటుంబాన్ని సుఖ సంతోషాలతో జీవించమని ఆశీర్వదిస్తారు. జ్యేష్ట మాసంలోని అమావాస్య రోజున కూడా స్నానం దానం చేయడం ద్వారా పూర్వీకుల అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ సంవత్సరం జ్యేష్ట అమావాస్య జూలై 5 లేదా జూలై 6 న అనే సందేహం చాలా మందిలో ఉంది. ఈ రోజున ఖచ్చితమైన తేదీ గురించి తెలుసుకుందాం.

2024 జ్యేష్ట అమావాస్య ఎప్పుడంటే

హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ట మాసంలోని అమావాస్య తేదీ జూలై 5 ఉదయం 04:57 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ రోజున సూర్యోదయం ఉదయం 05:29 గంటలకు ఉంటుంది. అమావాస్య తిథి జూలై 6వ తేదీ తెల్లవారుజామున 4:26 గంటలకు ముగుస్తుంది.ఆ రోజు ఉదయం 05:29 గంటలకు సూర్యోదయం అవుతుంది. కనుక ఉదయ తిథి, సూర్యోదయ సమయం ప్రకారం జ్యేష్ట అమావాస్య తేదీ జూలై 5 న ఉంటుంది.. జూలై 6 న అమావాస్య రోజున సూర్యోదయానికి ముందు ముగుస్తుంది. కనుక జూలై 5వ తేదీ శుక్రవారం జ్యేష్ట అమావాస్య.

జ్యేష్ట అమావాస్య రోజున ఏర్పడనున్న శుభ యోగం

సర్వార్థ సిద్ధి యోగం జ్యేష్ట అమావాస్య రోజున ఏర్పడుతోంది.. అంటే ఇది జూలై 6న ఏర్పడుతుంది. పంచాంగం ప్రకారం సర్వార్థ సిద్ధి యోగం ఒక శుభ యోగంగా పరిగణించబడుతుంది. ఈ రోజున చేసే పనులన్నీ విజయవంతమవుతాయి.

ఇవి కూడా చదవండి

అంతే కాదు జ్యేష్ట అమావాస్య రోజున ధృవ యోగం, శివ వాస యోగం కూడా ఏర్పడుతున్నాయి. ధృవ యోగ సమయంలో చేసే పూజ చాలా ఫలప్రదం. ఈ యోగంలో స్నానం చేయడం, దానం చేయడం, తర్పణం ఇవ్వడం వల్ల దోషరహిత ఫలితాలు లభిస్తాయి. శివ వాస యోగంలో కైలాస పర్వతంపై నివసించే శివ పార్వతులను పూజించడం ద్వారా ప్రతి కోరిక తీరుతుంది.

ఆషాఢ అమావాస్య రోజున చేయాల్సిన రెండు పరిహారాలు

జ్యేష్ట అమావాస్య రోజున ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయండి. ఆ తర్వాత శక్తి మేరకు ఆహారం, బట్టలు, పండ్లు, ఏదైనా పాత్రను దానం చేయండి. ఇలా చేయడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయి. సంతోషం, శ్రేయస్సు పెరుగుతుంది.

జ్యేష్ట అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మీ పూర్వీకులను స్మరించుకోండి. తరువాత పూర్వీకులకు నీరు, నల్ల నువ్వులు, తెల్లటి పువ్వులు మొదలైనవి సమర్పించాలి. తర్పణం సమర్పించడం ద్వారా పూర్వీకులు సంతుష్టులై తమ వారసులను ఆశీర్వదిస్తారు. ఇలా చేయడం వల్ల సంపద, సంతోషం, శ్రేయస్సు పెరుగుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Follow Us
ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..
ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
కలలో పాము కరిచినట్లు వస్తోందా? అయితే లైట్ తీసుకోవద్దు..
కలలో పాము కరిచినట్లు వస్తోందా? అయితే లైట్ తీసుకోవద్దు..
సీలింగ్ ఫ్యాన్ గాలి రావడం లేదా?ఇలా చేశారంటే, ఖర్చు లేని స్పీడ్
సీలింగ్ ఫ్యాన్ గాలి రావడం లేదా?ఇలా చేశారంటే, ఖర్చు లేని స్పీడ్
బేకరీ స్టైల్ పిజ్జా టోస్ట్.. ఓవెన్ లేకుండా పెనంపైనే ఇలా చేసేయండి
బేకరీ స్టైల్ పిజ్జా టోస్ట్.. ఓవెన్ లేకుండా పెనంపైనే ఇలా చేసేయండి
ప్రతి కుర్రాడిని ఏడిపించేసింది. చంచల పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..
ప్రతి కుర్రాడిని ఏడిపించేసింది. చంచల పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..
ఓటీటీలో ధురంధర్.. అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్
ఓటీటీలో ధురంధర్.. అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్