AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water Fasting: సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వాటర్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? ఆరోగ్య ప్రయోజనాలు, నష్టాలు తెలుసా..

నీరు మాత్రమే తాగడం ద్వారా బరువు తగ్గవచ్చు అని మీరు ఎప్పుడైనా విన్నారా. అవును ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వాటర్ ఫాస్టింగ్ గురించి చాలా చర్చ జరుగుతోంది. ఉపవాసంలోని ఈ పద్ధతి చాలా ప్రభావవంతంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ వాటర్ ఫాస్టింగ్ వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే వాటర్ ఫాస్టింగ్ ఎలా చేయవచ్చు అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Water Fasting: సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వాటర్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? ఆరోగ్య ప్రయోజనాలు, నష్టాలు తెలుసా..
Fasting
Surya Kala
|

Updated on: Jul 04, 2024 | 8:29 AM

Share

చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ప్రజలు స్థూలకాయం బారిన పడుతున్నారు. తర్వాత భారీకాయాన్ని తగ్గించుకోవడానికి ప్రజలు అనేక రకాల ఆహార ప్రణాళికలు, వ్యాయామాలు,యోగాలను అవలంబిస్తారు. ఇవన్నీ కొందరికి మేలు చేస్తాయి.. అయితే వీటితో పాటు నీరు మాత్రమే తాగడం ద్వారా బరువు తగ్గవచ్చు అని మీరు ఎప్పుడైనా విన్నారా. అవును ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వాటర్ ఫాస్టింగ్ గురించి చాలా చర్చ జరుగుతోంది. ఉపవాసంలోని ఈ పద్ధతి చాలా ప్రభావవంతంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ వాటర్ ఫాస్టింగ్ వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే వాటర్ ఫాస్టింగ్ ఎలా చేయవచ్చు అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే దీనిని చేసే సరైన పద్ధతి మీకు తెలియకపోతే వాటర్ ఫాస్టింగ్ ప్రయోజనాలు అందవు. అందుచేత నీటి ఉపవాసం ఎలా చేయాలి.. దాని ప్రయోజనాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

వాటర్ ఫాస్టింగ్ ద్వారా రోజుల్లోనే 15 కిలోల బరువు తగ్గినట్లు సోషల్ మీడియాలో పలువురు పేర్కొంటున్నారు. 21 రోజుల పాటు వాటర్ ఫాస్టింగ్ చేయడం వల్ల బరువు తగ్గడం తేలికవుతుందని ప్రజలు అంటున్నారు. అప్పటి నుండి వాటర్ ఫాస్టింగ్ గురించి చర్చ ప్రతిచోటా జరగడం మొదలైంది. నీటి ఉపవాసానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటంటే

నీటి ఉపవాసం అంటే ఏమిటి?

ఇవి కూడా చదవండి

నీటి ఉపవాసం అనేది బరువు తగ్గేందుకు చేసే ఒక ప్రక్రియ. దీనిలో ఒక వ్యక్తి దాదాపు 24 గంటల పాటు నీరు మాత్రమే తాగుతాడు. ఈ కాలంలో అతను నీరు తప్ప ఎలాంటి పానీయం, రసం లేదా మరే ఇతర ద్రవాన్ని తీసుకోడు. ఈ రకమైన ఉపవాస సమయంలో కాలేయం, కండరాల కణజాలాలలో నిల్వ చేయబడిన గ్లైకోజెన్‌ను కలిగి ఉన్న శరీరంలోని రిజర్వ్ శక్తిని ఉపయోగిస్తుంది.

నీటి ఉపవాసం వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఇవే

నీటి ఉపవాస ప్రక్రియ మీ శరీరాన్ని కీటోసిస్ వైపు తీసుకువెళుతుంది. దీనిలో శరీరం శక్తి కోసం శరీరంలో ఉన్న కొవ్వును విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. నీటి ఉపవాసం చేయడం వల్ల శరీర నిర్విషీకరణ, బరువు తగ్గడం వంటి అనేక ప్రయోజనాలున్నాయని తెలుస్తోంది. అయితే ఈ నీటి ఉపవాసం చేయడం వలన ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, అనేక నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవి ఏమిటో ఈ రోజు మనం తెలుసుకుందాం.

నీటి ఉపవాసం వలన నష్టాలు:

పోషకాల తగ్గింపు: నీటి ఉపవాసం కారణంగా చాలా మంది తమ శరీరంలో విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్స్ వంటి పోషకాల లోపంతో బాధపడుతున్నారు. ఈ లోపం కారణంగా ఎముకలు బలహీనపడతాయి. దీంతో పాటు త్వరగా రక్తహీనతతో పాటు అనేక ఇతర వ్యాధుల బారిన పడవచ్చు.

డీహైడ్రేషన్ సమస్య: శరీరం హైడ్రేటెడ్ గా ఉండాలంటే నీరు తాగడమే కాదు.. సరైన మోతాదులో ఆహారం కూడా తీసుకోవాలి. ఒకవేళ ఆహారం సరైన సమయంలో తీసుకోకపోతే డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంటుంది. డీహైడ్రేషన్ కారణంగా తలనొప్పి, అలసట, మూత్రపిండాల సమస్యలతో బాధపడవచ్చు.

పేలవమైన జీర్ణ వ్యవస్థ: ఎక్కువసేపు వాటర్ ఫాస్టింగ్ చేసి.. వెంటనే ఆహారం తీసుకుంటే. అది మీ జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది. అదే సమయంలో వాంతులు, కడుపు నొప్పి, వాపు వంటి సమస్యల బారిన కూడా పడవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏమైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)