ఇలాంటి అలవాట్లు ఉన్న స్త్రీలను భార్యగా పొందిన భర్తకు సుఖ శాంతులతో పాటు పురోభివృద్ధి ఉండదట..
కొంతమంది మహిళలు తమ భర్తలను అనవసరంగా అనుమానిస్తారు. ఇలా తరచుగా చేస్తూ ఉంటే భర్తకు కోపం వస్తుంది. అప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం బలహీనపడుతుందని చాణక్యుడు చెప్పాడు. చాలా సార్లు తమ భార్యలకు భర్తలు సలహాలు చెప్పినా.. వాటిని వినకుండా.. పట్టించుకోకుండా.. భర్త వద్దన్న పనిని చేస్తారు. మహిళలు తమ తప్పులను తప్పుగా కూడా అంగీకరించరు. అంతేకాదు తప్పు చేసినప్పటికి తాము చేసింది కరెక్ట్ అని చెప్పుకుంటారు. ఇలాంటి భార్యల ప్రవర్తన భర్తలను కలవరపెడుతుంది
వైవాహిక జీవితంలో ఆనందం కొనసాగాలంటే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. భార్య చేసే కొన్ని రకాల తప్పులతో ఆమె భర్త జీవితంలో పురోగతి ఉండదు. కనుక భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు నెలకొనాలంటే భార్యలు తమ అలవాట్లలో కొన్నింటిని మెరుగుపరచుకోవాలి. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని ఆచార్య చాణక్య చెప్పారు. చాలా సార్లు భార్యలు కొన్ని రకాల తప్పులు చేస్తారు. అప్పుడు భర్తలకు కోపం వస్తుంది. అంతేకాదు మనసులో విచారం చోటు చేసుకుంటుంది. కొంతమంది మహిళలు తమ భర్తలను అనవసరంగా అనుమానిస్తారు. ఇలా తరచుగా చేస్తూ ఉంటే భర్తకు కోపం వస్తుంది. అప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం బలహీనపడుతుందని చాణక్యుడు చెప్పాడు. చాలా సార్లు తమ భార్యలకు భర్తలు సలహాలు చెప్పినా.. వాటిని వినకుండా.. పట్టించుకోకుండా.. భర్త వద్దన్న పనిని చేస్తారు. మహిళలు తమ తప్పులను తప్పుగా కూడా అంగీకరించరు. అంతేకాదు తప్పు చేసినప్పటికి తాము చేసింది కరెక్ట్ అని చెప్పుకుంటారు. ఇలాంటి భార్యల ప్రవర్తన భర్తలను కలవరపెడుతుంది.
మహిళల చెడు అలవాట్లు
ఆచార్య చాణక్యుడు ప్రకారం చాలా సార్లు స్త్రీలు తమ భర్త వ్యక్తిగత జీవితంలోకి ఎక్కువగా తొంగి చూస్తారు. దీంతో ఆ భార్యాభర్తల బంధం త్వరలోనే తెగిపోయే దశకు చేరుకుంది. భర్త మానసిక స్థితి, వాతావరణం రెండింటినీ గమనించి అనంతరం భర్తను హాయిగా అడగండి. ఎందుకంటే భర్తకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి.
పురాణాల శాస్త్రాల ప్రకారం స్త్రీలు ఉదయం ఆలస్యంగా నిద్రపోవడం, పడుకోవడం లేదా సాయంత్రం సూర్యాస్తమయం అయిన వెంటనే నిద్రపోవడం ఇంట్లో పేదరికాన్ని ఆహ్వానిస్తున్నట్లే.
చాలా మంది స్త్రీలు ఆహరాన్ని ఎక్కువగా తయారు చేసి దానిని తిరిగి ఉపయోగించడం చేస్తారు. ఇలా చేయడం పురాణగ్రంధాలలో మంచిదిగా పరిగణించబడలేదు. ఇలా చేయడం వల్ల ఇంట్లోని సుఖ సంతోషాలు పోతాయి
గురువారం, ఏకాదశి, అమావాస్య రోజున స్త్రీలు తలస్నానం చేయడం అశుభమని శాస్త్రాలలో చెప్పబడింది. ఇలా చేయడం వల్ల గౌరవం పోతుంది.
స్త్రీలు ముందుగా ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి స్నానం చేసి పూజ చేయాలి. ఇలా చేయకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది.
రాత్రి నిద్ర పోయే ముందు మురికి పాత్రలను శుభ్రం చేయాలి. తెల్లవారుజామున లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని ఇంట్లోని ధూళిని చూసి ఆమె కోపించి వెనుదిరుగుతుందని నమ్ముతారు.
భర్తను దూషించే భార్య
స్త్రీలు స్వతహాగా ఎన్నో విషయాలను ఆలోచిస్తారు. ఒకొక్కసారి తమ భర్తను తిట్టడంలో వెనుకంజ వేయరు. భార్య చేసిన పనిని మనసుకు తీసుకోకపోయినా.. ఒకొక్కసారి భార్య చేసే పనుల వలన భర్తకు ఖచ్చితంగా చిరాకు వస్తుంది. అదే సమయంలో భర్త పొరపాటున ఏదైనా మరచిపోతే కొంతమంది మహిళలు తరచుగా తమ భర్తను వెక్కిరించడం ప్రారంభిస్తారు. ఇలా చేయడం వలన భార్య మీద భర్తకు చెప్పలేని ఆగ్రహం వస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు