AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలుష్యం కోరల్లో భారత్.. శ్వాస తీసుకుంటే గాల్లోకి ప్రాణాలు.. సర్వేలో షాకింగ్ నిజాలు..

దేశంలో వాయు కాలుష్యం బారినపడి ప్రతి ఏటా వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయాన్ని తాజాగా జరిపిన ఓ పరిశోధనలో శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్, వారణాశి ప్రాంతాల్లో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తరాది రాష్ట్రాలకే వాయుకాలుష్యం ముప్పు అధికం అని తెలిసింది. ఈ అధ్యయనంలో భాగంగా దాదాపు దేశంలోని 10 ప్రముఖ నగరాల్లోని పీఎం కాలుష్య రేణువులను పరిశీలించారు.

Srikar T
|

Updated on: Jul 04, 2024 | 10:47 AM

Share
దేశంలో వాయు కాలుష్యం బారినపడి ప్రతి ఏటా వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయాన్ని తాజాగా జరిపిన ఓ పరిశోధనలో శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్, వారణాశి ప్రాంతాల్లో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.

1 / 5
దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తరాది రాష్ట్రాలకే వాయుకాలుష్యం ముప్పు అధికం అని తెలిసింది. ఈ అధ్యయనంలో భాగంగా దాదాపు దేశంలోని 10 ప్రముఖ నగరాల్లోని పీఎం కాలుష్య రేణువులను పరిశీలించారు. అవి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధేశించిన వాటికంటే అధికంగా నమోదవుతున్నట్లు తెలిసింది.

2 / 5
ఈ 10 నగరాల్లో దాదాపు 36 లక్షల మంది మరణాలను అధ్యయనం చేయగా అధిక శాతం మంది వాయుకాలుష్యం బారినపడి ప్రాణాలను కోల్పోయినట్లు గుర్తించారు. మెషీన్ లెర్నింగ్ సాంకేతికతతో కూడిన అత్యాధునిక పద్దతుల ద్వారా సర్వే చేసినట్లు ప్రముఖ వైద్య పరిశోధన మాసపత్రిక లాన్సెట్‌ వెల్లడించింది.

3 / 5
అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్ కత్తా, ముంబై, పూణె, సిమ్లా, వారణాశి లాంటి ప్రధాన నగరాల్లో ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఈ ప్రధాన నగరాల్లో ప్రతి ఏటా దాదాపు వాయుకాలుష్యం కారణంగా 33వేల మంది చనిపోతున్నట్లు ధృవీకరించింది.

4 / 5
పీఎం 2.5 స్థాయి ప్రతీ క్యూబిక్‌ మీటరుకు 10 మైక్రోగ్రాములు పెరిగేకొద్దీ మరణాలు 1.42 శాతం అధికమైనట్లు అధ్యయనం తెలిపింది. దీనిని కట్టడికి చెట్లను అధికంగా పెంచాలని, నదీ జలాలను కలుష్యం బారిన పడకుండా కాపాడాలని సూచించారు. అలాగే అధిక పొగ వెలువడే మోటారు వాహనాలను కూడా నియంత్రించాలని హెచ్చరించారు.

5 / 5