AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చైనాలో వింత ట్రెండ్.. పానీపురీతో లైవ్ ఫిష్ ని తింటున్న ప్రజలు.. నెట్టింట్లో వీడియో కలకలం

ఆ దేశ ప్రజల వింత ఆహారపు అలవాట్ల కారణంగా తరచుగా ప్రముఖ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఓ మహిళ వీడియో వైరల్‌గా మారడంతో సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ఆన్ లైన్ లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక మహిళ గోల్గప్పలతో పాటు లైవ్ ఫిష్ తినడం కనిపిస్తుంది. చైనాలో ఇదో కొత్త వింత ట్రెండ్. పానీ పూరీల్లో బంగాళాదుంపలు, మసాలాల స్టఫ్ ని నింపి గోల్గప్పస్‌తో పాటు లైవ్ ఫిష్‌తో అలంకరించి వినియోగదారులకు అందిస్తున్నారు

Viral Video: చైనాలో వింత ట్రెండ్.. పానీపురీతో లైవ్ ఫిష్ ని తింటున్న ప్రజలు.. నెట్టింట్లో వీడియో కలకలం
Chinese New TrendImage Credit source: Instagram/megkoh
Surya Kala
|

Updated on: Jul 04, 2024 | 1:08 PM

Share

ప్రపంచంలో చాలా ప్రదేశాలలో వివిధ ఆహారపు అలవాట్లు ఉన్నాయి. ప్రజలు విచిత్రమైన ఆహారాన్ని తింటారు. చివరకు పాములు, తేళ్లు, గబ్బిలాలను కూడా వదిలిపెట్టడం లేదు. చాలా మంది ఈ జీవులను నిప్పు మీద కాల్చి, ఉడికించి లేదా వేయించి తింటున్నారు. కొంతమంది వాటిని సజీవంగా కూడా తింటారు. చైనాలో కూడా అలాంటిదే కనిపిస్తుంది. ఈ దేశం దాని సాంకేతికత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడమే కాదు. ఆ దేశ ప్రజల వింత ఆహారపు అలవాట్ల కారణంగా తరచుగా ప్రముఖ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఓ మహిళ వీడియో వైరల్‌గా మారడంతో సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.

ఆన్ లైన్ లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక మహిళ గోల్గప్పలతో పాటు లైవ్ ఫిష్ తినడం కనిపిస్తుంది. చైనాలో ఇదో కొత్త వింత ట్రెండ్. పానీ పూరీల్లో బంగాళాదుంపలు, మసాలాల స్టఫ్ ని నింపి గోల్గప్పస్‌తో పాటు లైవ్ ఫిష్‌తో అలంకరించి వినియోగదారులకు అందిస్తున్నారు. ఒక మహిళ చేతిలో ప్లేట్‌ను పట్టుకుని, అందులో రెండు గోల్‌గప్పలు, ఒక బతికి ఉన్న చేప, టమోటా ముక్కను ఉంచినట్లు వైరల్ వీడియోలో చూడవచ్చు. ఆ మహిళ చేపను ఫోర్క్‌తో కోసి తినడానికి ప్రయత్నిస్తుండగా.. చేప కట్ అవ్వకపోవడంతో ఆమె దానిని నేరుగా నోటిలో పెట్టుకుని నమలడం ప్రారంభించింది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలు ఉలిక్కిపడ్డారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

View this post on Instagram

A post shared by Meg Koh (@megkoh)

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మెగ్‌కో అనే ఐడితో షేర్ చేయబడింది. ఇది ఇప్పటివరకు 7 మిలియన్ల కంటే ఎక్కువ సార్లు చూశారు. అయితే 36 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసారు. అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ఓ నెటిజన్ ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నువ్వు స్త్రీవి కావు, రక్త పిశాచివి’ అని కామెంట్ చేయగా, ‘ఈ చైనీయులు ఏదైనా తింటారు.. కొత్త వ్యాధిని కనిపెడతారు అని మరో వినియోగదారు రాశారు. అదే విధంగా ఆ మహిళపై తమ కోపాన్ని వివిధ రకాల కామెంట్స్ తో తెలియజేస్తున్నారు. భగవంతుడు ఇలాంటి వారిని వచ్చే జన్మలో ఈ జీవిలాగా పుట్టించాలి.. అప్పుడు ఆ జీవిని మరొకరు ఇలాగే తినాలి అంటూ శాపం కూడా పెట్టారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..