ఇడ్లీ పిండి త్వరగా పులవాలని వంట సోడా కలుపుతున్నారా..? వామ్మో.. ఈ విషయం తెలిస్తే గుండె గుభేల్..
సాధారణంగా ఇడ్లీ పిండి దోసెల పిండి పులియాలంటే, పప్పు రుబ్బిన తర్వాత రాత్రంతా పిండిని వదిలేయాలి. అప్పుడే మీ దోసెలు కానీ, ఇడ్లీలు కానీ మంచి మృదువుగాను రుచికరంగాను వస్తాయి.

సాధారణంగా ఇడ్లీ పిండి దోసెల పిండి పులియాలంటే, పప్పు రుబ్బిన తర్వాత రాత్రంతా పిండిని వదిలేయాలి. అప్పుడే మీ దోసెలు కానీ, ఇడ్లీలు కానీ మంచి మృదువుగాను రుచికరంగాను వస్తాయి. ముఖ్యంగా ఇడ్లీ పిండి పులియక పోతే ఇడ్లీ రాయిలాగా వస్తుంది. అదే ఇడ్లీ పిండి మంచిగా పులిస్తే ఇడ్లీ మెత్తటి స్పాంజ్ లాగా రుచికరంగా వస్తుంది. అలాగే దోసెల పిండి కూడా బాగా పులిస్తే కరకరలాడే దోశ సిద్ధమవుతుంది. కానీ ఒక్కోసారి మనకు టైం లేనప్పుడు ఇడ్లీ పిండి త్వరగా పులియాలంటే అందులో వంట సోడా కలపడం చూసే ఉంటారు. ముఖ్యంగా హోటళ్లలో ఇడ్లీ దోశల పిండి పులియాలంటే అందులో వంట సోడా కలిపేస్తారు. తద్వారా పిండి త్వరగా పులుస్తుందని కొందరి నమ్మకం. కానీ అలా ఇన్ స్టంట్ గా పిండిని పులియబెట్టడం కోసం సోడా కలిపితే అది మొదటికే చేటు వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఉదర సంబంధిత వ్యాధులకు కారణం అవుతుందని కూడా హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా వంట సోడాలో కాల్షియం కార్బోనేట్ అదే విధంగా ఇతర యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి పేగుపూత వ్యాధికి కారణమయ్యే ప్రమాదం ఉంది. ఇడ్లీ పిండిలో వంట సోడా కలిపితే కొద్ది గంటల వ్యవధిలోనే పులుస్తుంది. కానీ హానికరమైన రసాయనాల కారణంగా పేగుల్లో అల్సర్ వంటి వ్యాధులు సైతం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరి ఇడ్లీ పిండి దోశల పిండి త్వరగా పులియాలంటే ఏం చేయాలి. అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. దీనికి పరిష్కారం లేకపోలేదు ముఖ్యంగా ఇడ్లీ దోశల పిండి త్వరగా పులియాలంటే అందులో కొద్దిగా పుల్లటి మజ్జిగ పోస్తే సహజ పద్ధతిలోనే కొలుస్తుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇడ్లీ దోశ పిండి పులియాలంటే ఆరోగ్యకరమైన సహజమైన ఈకోలి బ్యాక్టీరియా అవసరం అవుతుంది ఈ బ్యాక్టీరియా మన శరీరానికి ఎంతో అవసరమైనది. ముఖ్యంగా ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా కారణంగా మన అరుగుదల శక్తి పెరుగుతుంది. అందుకే ఇడ్లీ దోశలను ప్రోబయాటిక్ ఫుడ్స్ అంటారు.




అయితే హోటళ్లలోనూ ఇతర తోపుడుబండ్ల వారు ఇడ్లీ దోశ పిండి త్వరగా పులియాలని, అందులో వంట సోడా అలాగే ఫ్రూట్ సాల్ట్ వంటివి చక చక కలిపేసి ఆర్టిఫిషియల్ గా పిండిని పులియ పెట్టాలని ఆలోచిస్తుంటారు. అయితే ఇలాంటివి చేయడం వల్ల ఇడ్లీ రుచి కూడా మారిపోతుంది. సహజంగా పులిసిన పిండితోనే ఇడ్లీ దోశలు మంచి రుచికరంగా వస్తాయి. కావాలంటే హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేవారు. మీ ఇడ్లీ పిండి పులియాలంటే ఓ నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద పిండిని పులియ పెట్టాలి అందుకోసం, ఇంక్యుబేటర్స్ వాడటం మంచిది.
ఇడ్లీ దోశ పిండిని ఒకసారి పులిసిన తర్వాత దాన్ని ఫ్రీజర్ లో దాచిపెట్టుకొని వారం రోజులు వరకు వాడుకోవచ్చు. అందువల్ల మీరు ముందుగానే పెద్ద మొత్తంలో పిండిని నా పులియ పెట్టుకుంటే మంచిది పులిసిన పిండిని స్టోర్ చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..



