Sapota for Weight Loss: సపోటా పండు తినండి.. హ్యీపీగా వెయిట్ లాస్ అవ్వండి..

సరైన ఆహారం తీసుకుంటే.. ఆరోగ్యంగా, అందంగా ఉంటారు. మంచి ఆరోగ్యం కోసం ఖచ్చితంగా పండ్లను తింటూ ఉండాలి. అందులోనూ సీజనల్‌గా లభ్యమయ్యే పండ్లు తినడం వల్ల మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వేసవిలో ఎక్కువగా లభ్యమయ్యే పండ్లలో సపోటా కూడా ఒకటి. సపోటాలో శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. ఇది చూడటానికి చిన్న పండే అయినా.. అనేక పోషకాలు దాగి ఉన్నాయి. ఈ పండు తినడం వల్ల చాలా రకాల సమస్యలకు..

Sapota for Weight Loss: సపోటా పండు తినండి.. హ్యీపీగా వెయిట్ లాస్ అవ్వండి..
సపోటా పండు తినడం వల్ల బరువు సులువుగా తగ్గొచ్చు. ఇది శరీరంలోని అదనపు క్యాలరీలను వేగంగా కరిగిస్తుంది. అంతేకాకుండా సపోటా పండులో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. దీనివల్ల బరువు పెరుగుతారనే భయం అక్కర్లేదు.
Follow us
Chinni Enni

|

Updated on: Apr 04, 2024 | 5:09 PM

సరైన ఆహారం తీసుకుంటే.. ఆరోగ్యంగా, అందంగా ఉంటారు. మంచి ఆరోగ్యం కోసం ఖచ్చితంగా పండ్లను తింటూ ఉండాలి. అందులోనూ సీజనల్‌గా లభ్యమయ్యే పండ్లు తినడం వల్ల మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వేసవిలో ఎక్కువగా లభ్యమయ్యే పండ్లలో సపోటా కూడా ఒకటి. సపోటాలో శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. ఇది చూడటానికి చిన్న పండే అయినా.. అనేక పోషకాలు దాగి ఉన్నాయి. ఈ పండు తినడం వల్ల చాలా రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారికి ఇది బెస్ట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. మరి సపోటా తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.

సపోటాలోని పోషకాలు:

సపోటాలో మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, ఫైబర్, క్యాల్షియం, విటమిన్లు బి, సి, ఇలు, యాంటీ ఆక్సిడెంట్లు లభ్యమవుతాయి.

వెయిట్ లాస్‌కి చెక్:

బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారు తమ డైట్‌లో సపోటా తినడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇందులో ఫైబర్ అధికంగా లభిస్తుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన సూక్ష్మ పోషకాలను కరిగించడంలో బాగా హెల్ప్ చేస్తుంది. ఇవి తినడం వల్ల త్వరగా కడుపు నిండుతుంది. దీంతో ఇతర ఆహారాలు తీసుకోలేరు. ఈ విధంగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.

ఇవి కూడా చదవండి

జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది.

సపోటా తినడం వల్ల జీర్ణ క్రియ అనేది మెరుగు పడుతుంది. భోజనం చేసిన తర్వాత ఒక సపోటా తింటే చాలు. జీర్ణ సంబంధిత సమస్యలన్నింటినీ మాయం చేస్తుంది. అలాగే మలబద్ధకం సమస్యతో బాధ పడేవారు ఇది తింటే మంచి ఫలితం ఉంటుంది.

తక్షణ శక్తి ఇస్తుంది:

సపోటా తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. వ్యాయామం చేసిన తర్వాత ఒక సపోటా తింటే చాలు. అలసటగా ఉన్న మీరు యాక్టీవ్‌గా మారతారు.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

సపోటా తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సిలు ఉన్నాయి కాబట్టి.. బాడీలో ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయి. దీంతో వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.

చర్మ ఆరోగ్యం మెరుగు పడుతుంది:

సపోటా తినడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. వేసవి కాలంలో ఎక్కువగా చర్మ సమస్యల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. సపోటా తింటే.. చర్మానికి రక్షణగా నిలుస్తుంది. ఇందులో విటమిన్లు సి, ఇ, ఎలు ఉంటాయి కాబట్టి.. చర్మం సహజంగానే కాంతివంతంగా మెరుస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..