AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Almond Oil: మలబద్ధకం, జుట్టు రాలడం, స్కిన్ సమస్యలకు ఒకటే ఉపశమనం.. బాదం నూనెను ఇలా ఉపయోగించండి

బాదంపప్పును రోజూ తీసుకోవడం వల్ల గుండె, శరీరం రెండింటిని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అయితే బాదం నూనె కూడా ఆరోగ్యాన్నీ ఇస్తుంది. దీనిని ఉపయోగించి అనేక ఆరోగ్య, చర్మ సమస్యల నుంచి  బయటపడవచ్చు. నానబెట్టిన బాదంపప్పులను రోజూ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా మందికి తెలుసు. అయితే బాదం నూనె కూడా పోషకాల నిధి అని మీకు తెలుసా..! ఇది అనేక సమస్యల నుండి మిమ్మల్ని ఉపశమనం ఇస్తుంది. కనుక బాదం నూనె ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాం.. 

Almond Oil: మలబద్ధకం, జుట్టు రాలడం, స్కిన్ సమస్యలకు ఒకటే ఉపశమనం.. బాదం నూనెను ఇలా ఉపయోగించండి
Almond Oil Benefits
Surya Kala
|

Updated on: Mar 17, 2024 | 7:41 AM

Share

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడితే.. ఇందులో బాదం పప్పు చాలా శక్తివంతమైన గింజగా పరిగణించబడుతుంది. ఎందుకంటే మంచి కొవ్వు, ఒమేగా 3, విటమిన్ ఇ, బి, బి 2, కాల్షియం, పొటాషియం, ప్రోటీన్, ఫైబర్, జింక్ వంటి అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. బాదంపప్పును రోజూ తీసుకోవడం వల్ల గుండె, శరీరం రెండింటిని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అయితే బాదం నూనె కూడా ఆరోగ్యాన్నీ ఇస్తుంది. దీనిని ఉపయోగించి అనేక ఆరోగ్య, చర్మ సమస్యల నుంచి  బయటపడవచ్చు.

నానబెట్టిన బాదంపప్పులను రోజూ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా మందికి తెలుసు. అయితే బాదం నూనె కూడా పోషకాల నిధి అని మీకు తెలుసా..! ఇది అనేక సమస్యల నుండి మిమ్మల్ని ఉపశమనం ఇస్తుంది. కనుక బాదం నూనె ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాం..

మలబద్ధకం నుండి ఉపశమనం

మలబద్ధకంతో ఇబ్బంది పడుతుంటే.. రాత్రి నిద్రపోయే ముందు ఒక చెంచా బాదం నూనెను గోరువెచ్చని పాలలో వేసి తాగాలి. ఇలా చేయడం వలన ప్రేగులలో పేరుకుపోయిన మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

చర్మం కోసం బాదం నూనె

రోజూ నిద్రపోయే ముందు బాదం నూనెతో ముఖాన్ని మర్దన చేసుకుంటే..  ముడతలు, మచ్చలు, నీరసం వంటి అకాల వృద్ధాప్య సంకేతాలను నివారించవచ్చు. చర్మంలోని పొడి బారినతనాన్ని తొలగించి ముఖానికి సహజమైన కాంతిని తెస్తుంది. బాదం నూనె మొటిమలు, టానింగ్ , ఛాయను మెరుగుపరచడం వంటి సమస్యలను తొలగించడంలో కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది.

బాదం నూనెతో జుట్టుకు ప్రయోజనం

బాదం నూనె మీ జుట్టుకు వరం కంటే తక్కువ కాదు. వారానికి రెండుసార్లు తలని అంటుకోవడనికి ముందు అంటే 1.5 లేదా 2 గంటల ముందు బాదం నూనెను జుట్టుకు అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అంతేకాదు జుట్టు నిగనిగలాడుతూ ఉంటుంది. జుట్టు దృఢంగా మారుతుంది. చుండ్రు నుండి బయటపడటానికి నిమ్మరసంతో బాదం నూనెను కలిపి అప్లై చేయవచ్చు.

ఎముకలు దృఢంగా

బాదం నూనె పిల్లలకు మసాజ్ చేయడానికి కూడా అద్భుతమైనదిగా పరిగణించబడుతుంది.  ఎందుకంటే ఇది కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాదు బాదం నూనెను పాలలో కలిపి  తీసుకోవచ్చు. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. వీటిని టీవీ 9 ధ్రువీకరించడం లేదు. వైద్యుల సలహాలు, సూచనలు తో పాటించాల్సి ఉంటుంది.