AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: గోర్లు కొరికే అలవాటు మీకు ఉందా..? అయితే తెలియకుండానే సమస్యల్లో..

దైనందిన జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.. అయితే, మన గోర్లలో ఎన్నో రకాల బ్యాక్టిరియా దాగుంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మనం రోజు మొత్తంలో చేతులను చాలా సార్లు తాకుతాము.

Health:  గోర్లు కొరికే అలవాటు మీకు ఉందా..? అయితే తెలియకుండానే సమస్యల్లో..
Nail Biting
Ram Naramaneni
|

Updated on: Mar 17, 2024 | 7:09 PM

Share

దైనందిన జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.. అయితే, మన గోర్లలో ఎన్నో రకాల బ్యాక్టిరియా దాగుంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మనం రోజు మొత్తంలో చేతులను చాలా సార్లు తాకుతాము. ముఖం నుంచి శరీరంలోని ఇతర భాగాల వరకు.. చేతులతో తాకుతాం.. అయితే, మీ అందమైన గోర్ల క్రింద లక్షలాది సూక్ష్మ జీవులు నివసిస్తాయన్న విషయం మీకు తెలుసా? తెలియకపోతే.. ఈ స్టోరీ చదవాల్సిందే..

మన గోర్ల కింద 32 రకాల బాక్టీరియాలు, 28 రకాల ఫంగస్‌లు ఉన్నాయని ఓ పరిశోధన వెల్లడించింది. ఈ పరిశోధన 2021లో జరిగింది. అమెరికన్ పాడియాట్రిక్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించారు. పరిశోధకులు గోర్ల కింద నుంచి శాంపిల్స్ తీసుకుని వాటిని టెక్నికల్ పద్దతుల్లో విశ్లేషించగా అందులో 32 రకాల బ్యాక్టీరియా, 28 రకాల ఫంగస్ ఉన్నట్లు గుర్తించారు. వీటిలో, 50% నమూనాలలో బ్యాక్టీరియా మాత్రమే ఉంది. 6.3% మాత్రమే ఫంగస్‌ను కలిగి ఉంది. 43.7% బ్యాక్టీరియా, ఫంగస్‌ల మిశ్రమ సమూహాన్ని కలిగి ఉన్నట్లు అధ్యయనం తెలిపింది.

కాలి గోర్లలో కూడా బ్యాక్టీరియా ఉంటుందని అధ్యయనం పేర్కొంది. అందుకే గోర్లు, చేతుల పరిశుభ్రతపై శ్రద్ద వహించాల్సిన ఆవశ్యకతపై నివేదికలు నొక్కిచెబుతున్నాయి. అన్నింటికంటే, మనం తినడానికి, ముక్కు తుడుచుకోవడానికి లేదా ఎవరినైనా కౌగిలించుకోవడానికి, ప్రతిదానికీ మన చేతులను ఉపయోగిస్తాము. అటువంటి పరిస్థితిలో, గోర్ల శుభ్రత మన అందానికే కాదు, మన ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు..

పరిశోధకులు ఏమి చెప్పారు?..

గోర్ల కింద ఉండే బ్యాక్టీరియా, ఫంగస్ సాధారణంగా హానిచేయనివని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో, ఈ సూక్ష్మజీవులు బలహీనమైన ఇమ్యూనిటీ పవర్ ఉన్నవారిలో లేదా గోళ్లలో ఏదైనా గాయం లేదా ఇన్ఫెక్షన్ ఉన్నవారిలోకి ఈజీగా ప్రవేశిస్తాయి.   ఇన్ఫెక్షన్ లక్షణాలు గోర్లు రంగు మారడం, వాపు, నొప్పి, చీము కారడం వంటివి ఉండవచ్చు.

గోర్లను శుభ్రంగా ఉంచుకోవడం ఎలా?

  • మీ చేతులు, గోర్లను సబ్బు, నీటితో కనీసం రోజుకు రెండుసార్లు కడగాలి.
  • గోర్ల కింద మురికి పేరుకుపోకుండా ఉండేందుకు సాఫ్ట్ బ్రష్ ఉపయోగించండి.
  • పొడవాటి గోర్లు ఉంచుకోవడం మానుకోండి. ఎందుకంటే వాటిలో ధూళి, క్రిములు సులభంగా పేరుకుపోతాయి.
  • గోర్లను క్రమం తప్పకుండా కత్తిరించుకోండి.. గోళ్లను క్రమం తప్పకుండా కత్తిరించడానికి పదునైన సాధనాలను ఉపయోగించండి.
  • నెయిల్ పెయింట్ వేయడానికి ముందు, తర్వాత మీ గోర్లను శుభ్రం చేసుకోండి.
  • గోళ్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా ఏదైనా అసాధారణత కనిపించినట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి