మహిళలూ ఆరోగ్యం జర జాగ్రత్త.. ఆ విటమిన్ లోపం ఉంటే సంతోషంగా ఉండలేరట..
Vitamin D Deficiency: ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కావున, ఆరోగ్యంపై మరింత దృష్టిసారించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే, ఇంటి, కుటుంబ బాధ్యతల భారం కారణంగా చాలా సార్లు మహిళలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోలేరు.

Vitamin D Deficiency: ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కావున, ఆరోగ్యంపై మరింత దృష్టిసారించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే, ఇంటి, కుటుంబ బాధ్యతల భారం కారణంగా చాలా సార్లు మహిళలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోలేరు. కానీ కొన్ని పోషకాలు వారి శరీరానికి చాలా ముఖ్యమైనవి.. ఆ పోషకాల లోపం ఉంటే మహిళలు అనేక వ్యాధులతో పోరాడాల్సి వస్తుంది. అంతేకాకుండా మున్ముందు అనారోగ్య సమస్యలతోపాటు.. మరింత బలహీనతను ఎదుర్కోవలసి రావచ్చు. అటువంటి పోషకాలలో ఒకటి విటమిన్ డి.. ముఖ్యంగా మహిళల్లో డి విటమిన్ లోపం ఉండకూడదు.. అది ఉంటే.. అలాంటి వారు స్ట్రోక్, ఎముకలు, కీళ్లలో నొప్పిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ విటమిన్ లోపాన్ని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకోండి..
విటమిన్ డి లోపం లక్షణాలు..
తీవ్ర అనారోగ్యం బారిన పడటం..
శరీరంలో విటమిన్ డి తక్కువగా ఉన్న మహిళల రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. దీంతో వారు మరింత అనారోగ్యానికి గురవుతారు. మీ శరీరంలో ఉండే విటమిన్ డి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.. ఇది ఇన్ఫెక్షన్లు, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అలసట – నీరసం..
విటమిన్ డి లోపం కారణంగా మహిళలు రోజువారీ జీవితంలో సాధారణ కార్యకలాపాలు చేయడం కష్టమవుతుంది. వారు తరచుగా అలసట, బలహీనతను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేంకాకుడా శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. చివరకు డయాబెటిస్ బారిన పడే అవకాశం కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టెన్షన్..
మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో విటమిన్ డి సహాయపడుతుందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మహిళలు మానసికంగా సున్నితంగా పరిగణించబడతారు. కావున, వారు తప్పనిసరిగా ఈ విటమిన్లను పొందాలి. లేకుంటే వారు టెన్షన్, డిప్రెషన్‌కు గురవుతారు.
ఎముకలలో బలహీనత..
కాల్షియం వలె, విటమిన్ డి కూడా ఎముకల బలానికి బాధ్యత వహిస్తుంది. స్త్రీలు తమ శరీరంలో ఈ విటమిన్ తగినంత మొత్తంలో పొందకపోతే, వారి ఎముకలు బలహీనంగా మారతాయి. ఎముకలు చాలా నొప్పిగా మారుతాయి.
విటమిన్ డి పొందడానికి ఏమి చేయాలి?
సూర్యరశ్మి ద్వారా శరీరానికి లభించే విటమిన్ డిని సన్‌షైన్ విటమిన్ అని కూడా అంటారు. మీరు ప్రతిరోజూ 10 నుండి 20 నిమిషాల పాటు సూర్యకాంతిలో ఉంటే మీకు లోటు ఉండదు. అంతేకాకుండా.. పాల ఉత్పత్తులు, కొవ్వు చేపలు, పుట్టగొడుగులు మొదలైన కొన్ని ఆహారాల ద్వారా కూడా విటమిన్ డి పొందవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
