Tips for Grow Hair: ఒత్తైన పొడుగైన జుట్టు కావాలంటే.. మీ షాంపూలో ఇవి కలపండి..

ఒత్తైన, పొడవైన జుట్టు ఉంటే వచ్చే అందమే వేరు. కానీ ఇప్పుడున్న కాలంలో జుట్టుకు పెరగడం పక్కన పెడితే.. ఉన్న జుట్టే ఊడిపోతుంది. పల్చగా, డల్‌గా అందవిహీనంగా కనిపిస్తుంది. మగవారికి అయితే బట్ట తలలే కనిపిస్తున్నాయి. ఒత్తిడిని కూడా ఎక్కువగా తీసుకోవడం, పోషకాలు ఉన్న ఆహారాలు తినకపోవడం, కాలుష్యం కారణంగా కూడా జుట్టు రాలుతూ ఉంటుంది. జుట్టును కాపాడు కోవడం కోసం ఎంతో ఖరీదైన షాంపూలు..

Tips for Grow Hair: ఒత్తైన పొడుగైన జుట్టు కావాలంటే.. మీ షాంపూలో ఇవి కలపండి..
Tips For Grow Hair
Follow us

|

Updated on: Aug 15, 2024 | 4:53 PM

ఒత్తైన, పొడవైన జుట్టు ఉంటే వచ్చే అందమే వేరు. కానీ ఇప్పుడున్న కాలంలో జుట్టుకు పెరగడం పక్కన పెడితే.. ఉన్న జుట్టే ఊడిపోతుంది. పల్చగా, డల్‌గా అందవిహీనంగా కనిపిస్తుంది. మగవారికి అయితే బట్ట తలలే కనిపిస్తున్నాయి. ఒత్తిడిని కూడా ఎక్కువగా తీసుకోవడం, పోషకాలు ఉన్న ఆహారాలు తినకపోవడం, కాలుష్యం కారణంగా కూడా జుట్టు రాలుతూ ఉంటుంది. జుట్టును కాపాడు కోవడం కోసం ఎంతో ఖరీదైన షాంపూలు, నూనెలు వాడుతూ ఉంటారు. కానీ వీటి వల్ల ఫలితం పెద్దగా ఉండదు. అన్నీ అందరికీ పడవు. కానీ పెద్దగా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వస్తువులు, పదార్థాలు ఉపయోగించి కూడా మనం జుట్టును ఒత్తుగా, పొడుగ్గా, నల్లగా మార్చుకోవచ్చు. ఇప్పటికే జుట్టుకు సంబంధించిన చిట్కాలు ఎన్నో తెలుసుకున్నాం. ఇప్పుడు కొత్తగా మీ కోసం మరిన్ని తీసుకొచ్చాం. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఏం కావాలి?

మీరు వాడేది సాధారణ షాంపూ అయినా సరే.. ఇప్పుడు చెప్పే మూడు పదార్థాలు కలిపి ఉపయోగిస్తే మీ జుట్టు బలంగా, దృఢంగా మారుతుంది. రెండు స్పూన్ల కాఫీ పొడి, ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు స్పూన్ల తేనె.. ఈ మూడింటిని మీ షాంపూలో కలిపి ఉపయోగిస్తే ఎంతో పవర్ ఫుల్‌గా పని చేస్తాయి. మీ షాంపూలో వీటిని కలిపి తల స్నానం చేయండి. ఖచ్చితంగా నెల రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.

ఎలా ఉపయోగించాలి?

ముందు మీరు తలస్నానం చేసే ముందు ఒక గిన్నెలో మీకు ఎంత షాంపూ కావాలో అంత క్వాంటిటీ తీసుకోవాలి. అందులో రెండు స్పూన్ల కాఫీ పొడి, ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు స్పూన్ల తేనె వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా జుట్టు అంతా పట్టించాలి. కాసేపు వేళ్లతో సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఆ తర్వాత తల స్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారంలో రెండు సార్లు అయినా వీటిని ఉపయోగించి తల స్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు బలంగా, దృఢంగా తయారవుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పెళ్లికి వేళాయెరా! హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
పెళ్లికి వేళాయెరా! హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!
బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!
సిల్క్‌ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ అశ్విని..
సిల్క్‌ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ అశ్విని..
దేవర యాక్షన్ ఎఫెక్ట్‌ NTRకు గాయం | ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌.?
దేవర యాక్షన్ ఎఫెక్ట్‌ NTRకు గాయం | ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌.?
పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో డ్రోన్ ఎగురవేసిన యువతి
పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో డ్రోన్ ఎగురవేసిన యువతి
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్