Home Remedies: పట్టు చీరలు ఎప్పుడూ కొత్తగా ఉండాలంటే ఇలా చేయండి..

చీరలు అంటే ఆడువారికి ప్రాణమనే చెప్పాలి. ఎన్ని చీరలు ఉన్నా.. ఇంకా ఇంకా కొత్త చీరలను కొంటూనే ఉంటారు. అయితే పట్టు చీరలకు మరింత ప్రత్యేకత ఉంది. పట్టు చీరలు కడితే మహిళల అందం మరింత రెట్టింపు అవుతుందనే చెప్పాలి. పట్టు చీరలు చాలా ఖరీదు. ఇతర చీరలతో పోల్చితే వీటిని తక్కువగానే తీసుకుంటారు. ఇలా తీసుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఎందుకంటే పట్టు చీరలు త్వరగా..

Home Remedies: పట్టు చీరలు ఎప్పుడూ కొత్తగా ఉండాలంటే ఇలా చేయండి..
Home Remedies
Follow us

|

Updated on: Aug 15, 2024 | 4:44 PM

చీరలు అంటే ఆడువారికి ప్రాణమనే చెప్పాలి. ఎన్ని చీరలు ఉన్నా.. ఇంకా ఇంకా కొత్త చీరలను కొంటూనే ఉంటారు. అయితే పట్టు చీరలకు మరింత ప్రత్యేకత ఉంది. పట్టు చీరలు కడితే మహిళల అందం మరింత రెట్టింపు అవుతుందనే చెప్పాలి. పట్టు చీరలు చాలా ఖరీదు. ఇతర చీరలతో పోల్చితే వీటిని తక్కువగానే తీసుకుంటారు. ఇలా తీసుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఎందుకంటే పట్టు చీరలు త్వరగా పాడైపోతాయి అంటూంటారు. ఎంత రేటు పెట్టి కొన్నా.. వీటిని ధరించే సమయంలోనే కాస్త జాగ్రత్తలు వహించాలి. పట్టు చీరలు కాస్త డెలిగేట్‌గా ఉంటాయి. సాధారణ చీరల్లాగా మడత పెట్టలేం. ఎలా పడితే అలా ఉతకకూడదు. సరిగా ఉతకకపోతే త్వరగా పాడైపోతాయి. కాబట్టి పట్టు చీరల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ఎన్ని సంవత్సరాలు అయినా.. పట్టు చీరలు కొత్తగా కనిపించాలి అంటే.. ఈ జాగ్రత్తలు తీసుకుని.. చిట్కాలు ట్రై చేయండి.

బయట నుంచి వచ్చాక..

చాలా మంది బయట నుంచి వచ్చాక పట్టు చీరల్ని పక్కకు పడేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. వాటిని తీసి గాలికి ఆరనివ్వాలి. అప్పుడే వాటికి పట్టిన చెమట వాసన అనేది బయటకు పోతుంది. అప్పుడు మీరు దాన్ని మడత పెట్టి పక్కన పెట్టాలి. ఆ తర్వాత మాత్రమే పట్టు చీరల్ని డ్రై క్లీనింగ్‌కి ఇవ్వాలి. మనం ఉతికితే చీరలకు ఉన్న జరీ మొత్తం ఊడి వస్తుంది. దీంతో చీరలు త్వరగా పాడైపోతాయి. పట్టు చీరల్ని అస్సలు ఎప్పుడూ వాషింగ్ మెషీన్‌లో ఉతకకూడదు.

ఇలా మడత పెట్టండి:

చాలా మంది పట్టు చీరల్ని మడత పెట్టి అలానే ఉంచేస్తారు. ఇలా చేయడం వల్ల కూడా పట్టు చీరలు త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. పట్టు చీరల్ని ఎప్పుడూ ఒకే మడతలో ఉంచకూడదు. మడతలు మారుస్తూ ఉండాలి. అప్పుడప్పుడూ మార్చుతూ ఉండాలి. పేపర్ లేదా సపరేట్ కవర్‌‌లో ఉంచాలి. ఇలా చిన్న చిన్న చిట్కాలు ట్రై చేస్తే.. పట్టు చీరలు ఎప్పుడూ కొత్తగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!
బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!
సిల్క్‌ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ అశ్విని..
సిల్క్‌ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ అశ్విని..
దేవర యాక్షన్ ఎఫెక్ట్‌ NTRకు గాయం | ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌.?
దేవర యాక్షన్ ఎఫెక్ట్‌ NTRకు గాయం | ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌.?
పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో డ్రోన్ ఎగురవేసిన యువతి
పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో డ్రోన్ ఎగురవేసిన యువతి
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!