- Telugu News Photo Gallery What happens if you eat leftover chapatis at night? Check Here is Details in Telugu
Night Chapati: రాత్రి మిగిలిపోయిన చపాతీలు తింటే ఏం జరుగుతుందంటే..
ఈ మధ్య కాలంలో చాలా మంది రాత్రి పూట చపాతీలను తింటున్నారు. రాత్రి పూట చపాతీలను తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అధిక బరువు తగ్గడంతో పాటు జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే రాత్రి పూట చేసిన చపాతీలు మిగిలిపోతూ ఉంటాయి. దీంతో ఆ చపాతీలను ఉదయం తింటూ ఉంటారు. ఇలా రాత్రి మిగిలిపోయిన చపాతీలు ఉదయం తింటే ఏం జరుగుతుందో అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి రాత్రి పూట మిగిలిపోయిన చపాతీలను..
Updated on: Aug 15, 2024 | 4:28 PM

ఈ మధ్య కాలంలో చాలా మంది రాత్రి పూట చపాతీలను తింటున్నారు. రాత్రి పూట చపాతీలను తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అధిక బరువు తగ్గడంతో పాటు జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే రాత్రి పూట చేసిన చపాతీలు మిగిలిపోతూ ఉంటాయి.

దీంతో ఆ చపాతీలను ఉదయం తింటూ ఉంటారు. ఇలా రాత్రి మిగిలిపోయిన చపాతీలు ఉదయం తింటే ఏం జరుగుతుందో అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి రాత్రి పూట మిగిలిపోయిన చపాతీలను ఉదయం తినడం వల్ల చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అప్పుడు చేసిన చపాతీలో కంటే.. ఉదయానికి మిగిలిపోయిన చపాతీలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎలాంటి నష్టాలు లేవని.. హ్యాపీగా తినవచ్చని అంటున్నారు.

మిగిలిపోయిన చపాతీల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. పెరుగుతో తింటే చాలా మంచిది. అంతే కాకుండా జీర్ణ వ్యవస్థ, పేగుల ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.

మిగిలిపోయిన చపాతీలు ఉదయం తినడం వల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. అంతే కాకుండా గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి.. వెయిట్ లాస్ అయ్యేందుకు సహాయ పడుతుంది. గ్యాస్ సమస్యలు, కడుపు ఉబ్బరం, నొప్పి సమస్యలు కూడా తగ్గుతాయి.




