సోడాలోని సోడియమ్ కార్బొనెట్, ఆమ్లాలు జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. ఇది అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలకు దారి తీస్తుంది. కొన్ని సోడాల్లో కెఫిన్ ఉంటుంది. ఇది శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. అయితే, ఆల్కహాల్ శరీరాన్ని నెమ్మదిస్తుంది. ఈ రెండూ కలిపి తాగితే చాలా సేపు మెలకువగా ఉండాల్సి వస్తుంది. కానీ, ఇది చాలా ప్రమాదకరం. ముఖ్యంగా డీహైడ్రేషన్ కు గురికావడం.. తర్వాత తలనొప్పి, వాంతులు.. వంటి సమస్యలు వస్తాయి.