జొన్నల్లోని మెగ్నీషియం, ఐరన్, కాపర్, కాల్షియం, జింక్ వంటివి మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. రక్తహీనత సమస్య నుంచి పడేందుకు జొన్నరొట్టెలు దోహదం చేస్తాయి. అంతేకాదు.. జొన్న రొట్టె తినడం వల్ల అవి చాలా నెమ్మదిగా జీర్ణం అవుతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారిలో బ్లడ్‌షుగర్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది.