5 గంటల కంటే ఎక్కువగా మొబైల్ చూస్తున్నారా?

మీరు అతిగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా..? అదే పనిగా చూస్తున్నారా. రోజుకు 5 గంటలకంటే ఎక్కువసేపు ఫోన్ లో ఉంటే మాత్రం.. మీకు కచ్చితంగా కాన్సర్, ఒబేసిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెనెజులాలోని సైమన్‌ బొలివర్‌ యూనివర్శిటీలో గల హెల్త్‌ సైన్సెస్‌ ఫ్యాకల్టీ విభాగానికి చెందిన విద్యార్థులతో ఇటీవల పరిశోధకులు ఓ అధ్యయనం చేపట్టారు. 5 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సేపు మొబైల్‌ ఉపయోగించేవారిలో ఊబకాయం వచ్చే అవకాశాలు 43శాతం ఎక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనంలో […]

5 గంటల కంటే ఎక్కువగా మొబైల్ చూస్తున్నారా?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 29, 2019 | 8:21 PM

మీరు అతిగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా..? అదే పనిగా చూస్తున్నారా. రోజుకు 5 గంటలకంటే ఎక్కువసేపు ఫోన్ లో ఉంటే మాత్రం.. మీకు కచ్చితంగా కాన్సర్, ఒబేసిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెనెజులాలోని సైమన్‌ బొలివర్‌ యూనివర్శిటీలో గల హెల్త్‌ సైన్సెస్‌ ఫ్యాకల్టీ విభాగానికి చెందిన విద్యార్థులతో ఇటీవల పరిశోధకులు ఓ అధ్యయనం చేపట్టారు. 5 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సేపు మొబైల్‌ ఉపయోగించేవారిలో ఊబకాయం వచ్చే అవకాశాలు 43శాతం ఎక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనంలో తేలింది. ఇక మొబైల్‌ ఎక్కువగా వాడటం వల్ల మన జీవనశైలిలోనూ మార్పు వస్తుంది. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని పరిశోధకులు తెలిపారు.

‘మొబైల్‌ టెక్నాలజీ నేటి తరాన్ని చాలా ఆకట్టుకుంటోందన్నది నిజమే. దీని వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అయితే మరోవైపు కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లో గంటల తరబడి గడపడం వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. దీని వల్ల ఊబకాయం, షుగరు, గుండె సంబంధిత వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ల బాడిన పడే ప్రమాదం ఉంది’ అని రీసర్చ్‌ హెడ్‌ మిరారీ మాంటిల్లా మారన్‌ తెలిపారు.