TG High Court Jobs: టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎలా ఎంపిక చేస్తారంటే

తెలంగాణ హైకోర్టు పరిధిలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ ఉత్తీర్ణతతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. అర్హత కలిగినవారు ఎవరైనా ఆన్ లైన్ విధానంలో ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవచ్చు..

TG High Court Jobs: టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎలా ఎంపిక చేస్తారంటే
TG High Court
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 06, 2025 | 4:36 PM

తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో సబార్డినేట్ సర్వీస్ కోసం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1673 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్‌, ఎగ్జామినర్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్‌, కంప్యూటర్‌ అపరేటర్‌, సిస్టమ్‌ అనలిస్ట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో 1277 టెక్నికల్ పోస్టులు, 184 నాన్-టెక్నికల్ పోస్టులు, తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ పోస్టులు, సబార్డినేట్ సర్వీస్ కింద 212 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 31వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు ఇలా..

  • తెలంగాణ హైకోర్టు పరిధిలో పోస్టులు
  • కోర్టు మాస్టర్‌ అండ్ పర్సనల్ సెక్రటేరియస్‌ పోస్టుల సంఖ్య: 12
  • కంప్యూటర్‌ అపరేటర్‌ పోస్టుల సంఖ్య: 11
  • అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 42
  • ఎగ్జామినర్‌ పోస్టుల సంఖ్య: 24
  • టైపిస్ట్ పోస్టుల సంఖ్య: 12
  • కాపిస్ట్ పోస్టుల సంఖ్య: 16
  • సిస్టమ్‌ అనలిస్ట్ పోస్టుల సంఖ్య: 20
  • ఆఫీస్‌ సబార్డినేట్ పోస్టుల సంఖ్య: 75

తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ పరిధిలో పోస్టుల వివరాలు..

  • నాన్‌ – టెక్నికల్ పోస్టుల సంఖ్య: 1277
  • టెక్నికల్ పోస్టుల సంఖ్య: 184

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం కూడా కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ ద్వారా జనవరి 31, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద రూ.600, ఎస్టీ/ ఎస్సీ/ ఈడబ్ల్యూఎస్‌, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, పీడబ్ల్యూబీడీఎస్‌ అభ్యర్థులకు రూ.400 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నెలలో రాత పరీక్షలు ఉంటాయి.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.