AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG Inter 2024 Exam Fee: ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటివరకంటే?

తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చి నెలలో ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించి ఫీజులను ఇప్పటి వరకు చెల్లించని విద్యార్ధులకు ఇంటర్ బోర్డు మరో అవకాశం ఇచ్చింది. రూ. 2,500 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించడానికి విద్యార్ధులకు మరో మారు గడువు పెంపొందిస్తూ ఇంటర్ బోర్డు ప్రకటన జారీ చేసింది. చివరి తేదీ ఇదే..

TG Inter 2024 Exam Fee: ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటివరకంటే?
TG Inter 2024 Exam Fee
Srilakshmi C
|

Updated on: Jan 07, 2025 | 9:00 AM

Share

హైదరాబాద్, జనవరి 7: తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగిస్తూ ఇంటర్ బోర్డు తాజాగా ప్రకటన జారీ చేసింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు డిసెంబర్‌ 31వ తేదీతో గడువు ముగియగా.. రూ. 2,500 అపరాధ రుసుముతో జనవరి 16వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు గడువు పొడిగించారు. ఇప్పటి వరకు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్‌ బోర్డు సూచించింది. కాగా ఇప్పటికే ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే.

తాజా షెడ్యూల్‌ ప్రకారం మార్చి 5వ తేదీ నుంచి పరీక్షలు మొదలుకానున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి, ఆ మరుసటి రోజు అంటే మార్చి 6వ తేదీ నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు ఇంటర్‌బోర్డు పరీక్షలు మార్చి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఇక ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు జరుగనున్నాయి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల పూర్తి షెడ్యుల్ ఇదే..

ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ పరీక్షల తేదీలు..

  • మార్చి 5వ తేదీన పార్ట్-2 సెకండ్‌ ల్యాంగ్వేజ్‌
  • మార్చి 7వ తేదీన పార్ట్-1 ఇంగ్లీష్ పేపర్
  • మార్చి 11వ తేదీన మాథ్స్ పేపర్ 1A, బోటని పపెర్-1 , పొలిటికల్ సైన్స్ పేపర్-1
  • మార్చి 13వ తేదీన మ్యాథ్స్ పేపర్ 1B , జూలాజి పేపర్ -1, హిస్టరీ పేపర్-1
  • మార్చి 17వ తేదీన ఫిజిక్స్ , ఎకనామిక్స్
  • మార్చి 19వ తేదీన కెమిస్ట్రీ , కామర్స్

ఇంటర్‌ సెకెండ్ ఇయర్ పరీక్షల తేదీలు..

  • మార్చి 6వ తేదీన పార్ట్-2 సెకండ్‌ ల్యాంగ్వేజ్‌
  • మార్చి 10వ తేదీన పార్ట్-1 ఇంగ్లీష్
  • మార్చి 12వ తేదీన మాథ్స్ పేపర్ 2A, బోటని , పొలిటికల్ సైన్స్
  • మార్చి 15వ తేదీన మ్యాథ్స్ పేపర్ 2B , జూలాజి, హిస్టరీ
  • మార్చి 18వ తేదీన ఫిజిక్స్ , ఎకనామిక్స్
  • మార్చి 20వ తేదీన కెమిస్ట్రీ , కామర్స్

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..