Tips for Gen Z placement: ప్లేస్‌మెంట్లలో జాబ్ కొట్టాలంటే.. ఈ పంచతంత్రాల్లో మీరు మెరవాల్సిందే!
మరికొన్ని రోజుల్లో క్యాంపస్ ప్లేస్ మెంట్లు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో విద్యార్ధులు నచ్చిన కొలువు సొంతం చేసుకోవాలంటే ఇతరులకంటే భిన్నంగా ఉండాలనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మీ ప్రొఫైల్ లో కీలక అంశాలను అప్ డేట్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ప్లేస్‌మెంట్ సీజన్ సమీపిస్తుంది. జాబ్ మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి Gen Zకి ఇదే మంచి అవకాశం. ప్లేస్‌మెంట్‌లు అందుకోవాలంటే Gen Z బలమైన ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌ను నిర్మించడం, నైపుణ్యం అభివృద్ధిలో పాల్గొనడం, సంబంధిత అనుభవాలను హైలైట్ చేయడానికి వారి రెజ్యూమ్‌లను రూపొందించడంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. అలాగే మాక్ ఇంటర్వ్యూలను ప్రాక్టీస్ చేయడం, ఇండస్ట్రీ ట్రెండ్‌లపై అప్‌డేట్‌గా ఉండటం, కమ్యూనికేషన్, టీమ్‌వర్క్ వంటి సాఫ్ట్ స్కిల్స్‌ను డెవలప్ చేసుకోవడం చాలా అవసరం. నచ్చిన కొలువు దక్కించుకోవాలంటే వీటితోపాటు మరికొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. లింక్డ్‌ఇన్ ఇండియాలో కెరీర్ నిపుణురాలు, ఎడిటోరియల్ హెడ్ నిరాజితా బెనర్జీ కొన్ని చిట్కాలు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్‌డేట్ చేసుకోవాలి
రిక్రూటర్‌లను ఆకర్షించడానికి మీ నైపుణ్యాలు, విద్య, విజయాలు, అనుభవాలకు సంబంధించిన సమాచారంతో మీ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. చక్కగా తయారు చేసిన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ మీ స్ట్రెంథ్‌ను ప్రదర్శించడమే కాకుండా మీరు హైలైట్ చేసే నైపుణ్యాల ఆధారంగా సంబంధిత ఉద్యోగ అవకాశాలు వరిస్తాయి.
పని చేయడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం తెలిసేలా చెప్పాలి
రిక్రూటర్‌లకు మీ జాబ్ సెర్చ్‌ను సూచించడానికి లింక్డ్‌ఇన్ ‘ఓపెన్ టు వర్క్’ ఫీచర్‌ని యాక్టివేట్ చేయాలి. ఇండస్ట్రీ ట్రెండ్‌లు, కెరీర్ ఇన్‌సైట్స్‌లను ప్రొఫైల్‌తో జత చేయాలి. ఇది మిమ్మల్ని పోటీలో ప్రత్యేకంగా నిలబెట్టగలదు.
ప్రయోగాత్మక అనుభవాలను హైలైట్ చేయాలి
ఇంటర్న్‌షిప్‌లు, వాలంటీరింగ్, ఫ్రీలాన్స్ గిగ్‌లు ఆచరణాత్మక, బదిలీ చేయగల నైపుణ్యాలను ప్రదర్శించడం ద్వారా మీ పోర్ట్‌ఫోలియోను స్పెషల్‌గా ఉంచవచ్చు. రిక్రూటర్‌ల దృష్టిని ఆకర్షించడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నిరూపించడానికి మీ ప్రొఫైల్‌లో ఈ అనుభవాలను హైలైట్ చేయాలి.
సిఫార్సులు, ఇన్‌సైట్స్ మర్చిపోకండి
నెట్‌వర్క్ ఒక శక్తివంతమైన కెరీర్ సాధనం. మీ ఆసక్తులకు అనుగుణంగా లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో చేర్చండి. చర్చల్లో పాల్గొనడం, మీ ఫీల్డ్‌లోని నిపుణులతో కనెక్ట్ అవ్వడం వంటివి చేయాలి. ఇది నెట్‌వర్కింగ్ పరిశ్రమ ఇన్‌సైట్స్, మెంటర్‌షిప్, జాబ్ రెఫరల్‌లను కూడా అందిస్తుంది.
మరిన్ని అవకాశాల కోసం మీ స్కిల్స్‌ను అప్‌డేట్ చేసుకోండి
సాంకేతిక పరిజ్ఞానానికి మించిన స్కిల్స్ ఉన్నవారికి నేడు అవకాశాలు తలుపు తడుతున్నాయి. సాఫ్ట్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు విలువ ఇస్తున్నాయి. గ్రాడ్యుయేట్‌లు వారి నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడటానికి, లింక్డ్‌ఇన్ వంటి లింక్డ్‌ఇన్ లెర్నింగ్ కోర్సులను కూడా అందిస్తుంది. కాలేజీ గ్రాడ్యుయేట్‌ల కోసం జాబ్ సెర్చింగ్, ఇంటర్న్‌షిప్‌ను ఉద్యోగంగా మార్చడం, కెరీర్ స్టార్టర్స్ కోసం ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్, 30-నిమిషాల రెజ్యూమ్ రిఫ్రెష్, ఇంటర్వ్యూ ప్రశ్నల మాస్టరింగ్, టెక్నికల్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ రెండింటినీ పొందడం వల్ల ఏ రంగంలోనైనా బలమైన పోటీదారుగా నిలదొక్కుకుంటారు.