AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: పిచ్చి కొట్టుడు కొడుతున్నా.. పిల్లాడు పిల్లాడే! మ్యాచ్‌ తర్వాత వైభవ్‌ ఏం చేశాడంటే?

ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో 776 పరుగులు, 72 సిక్సర్లు బాదిన వైభవ్‌ సూర్యవన్షీ ప్రయాణం చేదుగా ముగిసింది. రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఓటమితో భావోద్వేగానికి లోనైన అతడు కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులను కదిలించింది. సెంచరీకి చేరువలో మళ్లీ నిరాశ ఎదురైంది.

Video: పిచ్చి కొట్టుడు కొడుతున్నా.. పిల్లాడు పిల్లాడే! మ్యాచ్‌ తర్వాత వైభవ్‌ ఏం చేశాడంటే?
Vaibhav Suryavanshi
SN Pasha
|

Updated on: May 30, 2026 | 9:57 AM

Share

ఐపీఎల్ 2026 సీజన్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్‌ సూర్యవన్షీ సీజన్ ముగిసే సమయానికి భావోద్వేగానికి లోనయ్యాడు. రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఓటమి పాలవడంతో యువ బ్యాటర్ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు అభిమానులను కలచివేశాయి. గుజరాత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 214 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇందులో వైభవ్ సూర్యవంశీ 96 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతని పోరాటం జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయింది. లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి, ఇంకా ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.

మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్‌ చాలా డల్‌గా కనిపించాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లని ఆపుకుంటూ తనలోని పసివాడ్ని బయటపెట్టాడు. తీవ్ర నిరాశలో కనిపించిన అతడిని సహచర ఆటగాళ్లు ఓదార్చే ప్రయత్నం చేశారు. అనంతరం డగౌట్‌లోకి వెళ్లిన వైభవ్ తన టోపీతో ముఖాన్ని కప్పుకుని కూర్చున్నాడు. అతని కళ్లలో కనిపించిన కన్నీళ్లు ఈ ఓటమి అతడిని ఎంతగా బాధించిందో తెలుస్తుంది. ఈ సీజన్ మొత్తం వైభవ్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. 48.5 సగటుతో 776 పరుగులు సాధించిన అతడు, 72 సిక్సర్లు బాదుతూ 237కు పైగా స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. ఒక సీజన్‌లో 700కుపైగా పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. అలాగే కేవలం 440 బంతుల్లో 1000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

అయితే గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడు సార్లు శతకానికి చేరువలో అవుట్ కావడం వైభవ్‌ను మరింత నిరాశకు గురిచేసింది. 93, 97, 96 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగియడంతో పాటు చివరి మ్యాచ్‌లో జట్టు నిష్క్రమించడంతో అతని హృదయం ముక్కలైనట్లైంది. అయినప్పటికీ ఈ సీజన్‌లో అతని ప్రదర్శన భవిష్యత్తు భారత క్రికెట్‌కు సూపర్‌ స్టార్‌ అయ్యే క్రికెటర్‌గా అయితే కనిపిస్తున్నాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us