AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంక పెళ్ళిళ్లు ఎలా అవుతాయ్ సార్.. ట్రాఫిక్ పోలీసుల వద్ద కాబోయే అల్లుడి హిస్టరీ చెక్ చేసిన వ్యక్తి

Traffic Record Before Marriage: కాకినాడలో ఓ తండ్రి కాబోయే అల్లుడి కారు, బైక్ నంబర్లతో ట్రాఫిక్ పోలీసులను సంప్రదించి డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు, స్పీడింగ్ టికెట్లు, ట్రాఫిక్ ఉల్లంఘనల చరిత్ర ఉందా? అని తెలుసుకోవడం చర్చనీయాంశమైంది. “ట్రాఫిక్ చలానాలు ఎక్కువగా ఉంటే పెళ్లి చేయను” అన్నదే ఆయన ఆలోచనట.

ఇంక పెళ్ళిళ్లు ఎలా అవుతాయ్ సార్.. ట్రాఫిక్ పోలీసుల వద్ద కాబోయే అల్లుడి హిస్టరీ చెక్ చేసిన వ్యక్తి
Traffic Police Father
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: May 30, 2026 | 9:21 AM

Share

కాకినాడ జిల్లా కాకినాడలో ఓ మామగారు కాబోయే అల్లుడిపై చేసిన బ్యాక్‌గ్రౌండ్ చెక్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాబోయే అల్లుడి కారు నంబర్, బైక్ నంబర్ రెండూ తీసుకుని నేరుగా స్థానిక ట్రాఫిక్ సీఐని కలిసి.. “మా అల్లుడికి ఏమైనా డ్రంకెన్ డ్రైవింగ్ కేసులున్నాయా? స్పీడింగ్ టికెట్లు ఉన్నాయా? ట్రాఫిక్ ఉల్లంఘనల చరిత్ర ఏమైనా ఉందా?” అంటూ పూర్తి వివరాలు అడిగారట. అలాంటి ట్రాఫిక్ చలానాలు ఉంటే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయను” అనేదే ఆ తండ్రి ఆలోచనట.

మొదట ఆశ్చర్యపోయిన సీఐ.. “ఇదీ ఒక మంచి వెరిఫికేషన్ పద్ధతే కదా!” అనుకుని రికార్డులు పరిశీలించారట. చివరకు, “మీ అల్లుడికి డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు లేవు, స్పీడింగ్ టికెట్లు లేవు. నిశ్చింతగా పెళ్లి చేసేయండి” అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట పోలీసులు. ఇక పెళ్లి చూపుల్లో ఫోటోలు, జీతం మాత్రమే కాదు. ట్రాఫిక్ హిస్టరీ కూడా చెక్ చేసే రోజులు వచ్చేశాయి అని చర్చించుకుంటున్నారు స్థానికులు.

తన భార్య తన కూతురు చిన్నప్పుడే చనిపోవడంతో ఆమెను గారభంగా పెంచుకున్నానని.. అల్లుడుకు సరైన ప్రవర్తన లేకపోతే తన కూతురు ఇబ్బంది పడుతుందని పోలీసులకు చెప్పారంట సదరు తండ్రి.

వివరాలు వెల్లడిస్తున్న సీఐ వీడియో..

Follow Us