AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరటిపండు, పాలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..? ఆయుర్వేదం చెప్పేది తెలిస్తే మళ్లీ ఆ తప్పు చెయ్యరు..

అరటిపండు.. పాలు.. విడివిడిగా తింటే ఇవి అమృతం.. కానీ కలిపి తీసుకుంటే మాత్రం శరీరానికి స్లో పాయిజన్ అంటోంది ఆయుర్వేదం. అవును.. మనం ఎంతో ఇష్టంగా తాగే బనానా మిల్క్‌షేక్ మన ఆరోగ్యానికి ఎంతటి చేటు చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు. అసలు ఈ రెండింటి కాంబినేషన్ ఎందుకు ప్రమాదకరమో.. నిపుణులు ఏమంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: May 30, 2026 | 7:18 AM

Share
మనలో చాలా మందికి భోజనం తర్వాత ఒక అరటిపండు తినే అలవాటు ఉంటుంది. ఇక జిమ్‌కు వెళ్లేవారైతే బరువు పెరగడానికి, తక్షణ శక్తి కోసం బనానా మిల్క్‌షేక్‌లను అమృతంలా తాగేస్తుంటారు. విడివిడిగా చూస్తే.. పాలలో కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటే, అరటిపండులో పొటాషియం, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. రెండూ సూపర్ ఫుడ్సే.. కానీ ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి.

1 / 5
జీర్ణక్రియపై భారీ దెబ్బ: ఆయుర్వేదం ప్రకారం.. మనం తినే ఆహారాల మధ్య సమతుల్యత ఉండాలి. పాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే అది చలవ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు అరటిపండు పుల్లటి, వేడి చేసే తత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు భిన్న స్వభావాలు ఉన్న ఆహారాలను కలిపి తీసుకున్నప్పుడు జీర్ణవ్యవస్థ తీవ్ర గందరగోళానికి గురవుతుంది. జీర్ణక్రియ మందగించి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి.

2 / 5
కడుపులో టాక్సిన్స్ పేరుకుపోతాయి: పాలు, అరటిపండు కలిపి తీసుకున్నప్పుడు అవి కడుపులో పూర్తిగా జీర్ణం కావు. ఫలితంగా అవి కడుపులోనే ఉండిపోయి కిణ్వ ప్రక్రియకు గురవుతాయి. ఇది శరీరంలో ఆమ ఉత్పత్తి కావడానికి దారితీస్తుంది. ఈ అసంపూర్ణ జీర్ణక్రియ వల్ల తీవ్రమైన అసిడిటీ, నెమ్మదిగా ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

3 / 5
కఫం పెరిగి.. శ్వాసకోశ, చర్మ సమస్యలు: ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాలు, అరటిపండు రెండూ శరీరంలో కఫాన్ని పెంచే స్వభావం ఉన్నవే. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సైనస్, జలుబు, దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ ఇబ్బందులు తీవ్రమవుతాయి. శరీరంలో పేరుకుపోయే ఈ టాక్సిన్స్, ఆమ్లత్వం రక్తాన్ని కలుషితం చేసి, చర్మంపై దద్దుర్లు, అలెర్జీలు, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు కారణం కావచ్చు.

4 / 5
నిపుణుల సూచన: మీ జీర్ణవ్యవస్థ చాలా బలంగా ఉంటే, ఈ రెండింటినీ కలిపి తీసుకున్నప్పుడు తక్షణమే పెద్ద సమస్యలు కనిపించకపోవచ్చు. కానీ దీర్ఘకాలంలో ఇది ఖచ్చితంగా రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. అరటిపండు తిన్న తర్వాత కనీసం 20 నుండి 30 నిమిషాల వ్యవధి ఇచ్చి పాలు తాగడం అత్యుత్తమమైన పద్ధతి. ఒకవేళ బనానా మిల్క్‌షేక్ తాగడం అస్సలు మానలేకపోతే.. అందులో కొద్దిగా యాలకులు, శొంఠి పొడి లేదా జాజికాయ పొడిని చేర్చుకోవడం మంచిది. ఇవి ఆ కాంబినేషన్ వల్ల వచ్చే సమస్యలను కొంతవరకు తగ్గిస్తాయి.

5 / 5
Follow Us