#COVID-19 మోదీ నిర్ణయానికి జై కొట్టిన సోనియా

సొంత తనయుడు రాహుల్ గాంధీకి షాకిచ్చారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. కరోనా వైరస్ థ్రెట్ సమయంలో మోదీ తీసుకుంటున్న నిర్ణయాలను ట్విట్టర్ వేదికగా విమర్శిస్తూ వస్తున్న రాహుల్ గాంధీకి భిన్నంగా సోనియాగాంధీ స్పందించారు.

#COVID-19 మోదీ నిర్ణయానికి జై కొట్టిన సోనియా
Follow us
Rajesh Sharma

|

Updated on: Mar 26, 2020 | 3:59 PM

Sonia Gandhi writes Narendra Modi over country wide lock down: కరోనాను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం తగిన విధంగా ప్రిపేర్ కాలేదంటూ తనయుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శలతో రెచ్చిపోతుంటే.. ఆయన తల్లి, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని స్వాగతించారు. స్వాగతించడమే కాదు.. 21 రోజుల లాక్ డౌన్ నిర్ణయాన్ని దేశప్రజలంతా పాటించాల్సి వుందని నొక్కి చెప్పారు. ఈ మేరకు గురువారం ప్రధానికి లేఖ రాశారు సోనియా గాంధీ.

లాక్ డౌన్ సమయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన సోనియా గాంధీ ప్రజల సమస్యలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కొన్ని సూచనలను ఆమె ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు సోనియా గాంధీ. ‘‘కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రకటించిన 21 రోజుల నేషన్-వైడ్ లాక్ డౌన్‌ని స్వాగతిస్తున్నాం.. కరోనా మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మేము పూర్తిగా మద్దతు ఇస్తాం.. ప్రస్తుతం దేశం క్లిష్టమైన సమయంలో ఉండడం వలన, మనం అందరం ఒకరికి ఒకరు సహకరించుకోవాలి.. ప్రస్తుతం వ్యక్తి గత ప్రయోజనాల కంటే మన దేశం పట్ల నిజమైన మానవత్వం, కర్తవ్యాన్ని నిర్వర్తించడం అవసరం.. మద్దతు, సహకారం, స్ఫూర్తితో, మనం అందరం ఒక భారీ ఆరోగ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉందాం.. ’’ అని సోనియా గాంధీ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.